తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఈనెల 10లోపు విడుదల చేయడానికి బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జవాబు పత్రాల వాల్యుయేషన్, స్కానింగ్ పూర్తయ్యాయి. మే 12 నుంచి 21 వరకు జరిగిన పరీక్షలకు 3,98,358 మంది హాజరయ్యారు.

ఎంసెట్ కౌన్సెలింగ్, డిగ్రీ అడ్మిషన్లకు ఇబ్బంది లేకుండా ఫలితాలు త్వరగా విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. లా సెట్, పీజీఎల్​సెట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.