Overseas Jobs | ఐటీఐ, డిగ్రీ చదివిన వారికి గుడ్‌న్యూస్.. జర్మనీలో రూ.3లక్షల జీతంతో ఉద్యోగవకాశాలు!

Overseas Jobs | విదేశాల్లో ఉద్యోగం చేయాలనునకునే యువతకు తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ టామ్‌కామ్ (TOMCOM) శుభవార్త చెప్పింది. జర్మనీలో ట్రాన్‌మిషన్ లైన్‌ టెక్నీషియన్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.

Overseas Jobs | ఐటీఐ, డిగ్రీ చదివిన వారికి గుడ్‌న్యూస్.. జర్మనీలో రూ.3లక్షల జీతంతో ఉద్యోగవకాశాలు!

Overseas Jobs | విదేశాల్లో ఉద్యోగం చేయాలనునకునే యువతకు తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ టామ్‌కామ్ (TOMCOM) శుభవార్త చెప్పింది. జర్మనీలో ట్రాన్‌మిషన్ లైన్‌ టెక్నీషియన్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.3లక్షల జీతం లభిస్తుందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

అర్హత

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటీఐ/డిప్లొమా/ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులకు ఇంగ్లీష్‌లో కనీసం B1 స్థాయి పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. జర్మన్ భాష రాకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చచు.

జీతభత్యాలు

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.3లక్షల వరకు వేతనం అందిస్తారు. అలాగే ఉచిత వసతి సదుపాయం కలదు. కాకపోతే రెసిడెన్స్ పర్మిట్ ఫీజు కింద 100 యూరోలు అలాగే వీసా ఖర్చులు, విమాన ప్రయాణ ఖర్చులు అభ్యర్థులే భరించాల్సి ఉంటుంది.

ఉద్యోగ బాధ్యతలు

* ఓవర్హెడ్ పవర్ లైన్ సిస్టమ్స్ ఇన్‌స్టాలేషన్, మెయింటెనెన్స్
* ట్రాన్స్‌మిషన్ టవర్ల అసెంబ్లింగ్, డిస్మాంట్లింగ్
* కండక్టర్లు, ఇన్సులేటర్లు, ఫిట్టింగ్ అమర్చడం
* ఎత్తులో ఉండి సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌తో పనిచేయాల్సి ఉంటుంది
* బయట వాతావరణ పరిస్థితుల్లో పనిచేయాలి

దరఖాస్తు విధానం

ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాను tomcom.resume@gmail.com అడ్రస్‌కు మెయిల్ చేయాల్సి ఉంటుంది. పై ఫొటోలో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా అప్లై చేయవచ్చు. మరిన్ని వివరాలకు 94400 51452, 94400 49937, 94400 50951 నంబర్లలో సంప్రదించవచ్చు.

Read More:

Overseas Nursing Jobs | ఖతార్‌లో నర్సింగ్ ఉద్యోగాలు.. నెలకు రూ.1.21లక్షల ట్యాక్స్ ఫ్రీ జీతం.. రవాణా, వసతి కూడా ఫ్రీ!