Overseas Nursing Jobs | జర్మనీలో నర్స్ పోస్టులు.. నెలకు 3లక్షల జీతం, ఫ్యామిలీకి డిపెండెంట్ వీసా పొందే గోల్డెన్ ఛాన్స్!

Overseas Nursing Jobs | జర్మనీలోని ప్రముఖ ఆస్ప్రతుల్లో నర్సింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వ రంగ సంస్థ TOMCOM ద్వారా నియామకాలు చేపట్టారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 3లక్షల వరకు జీతంతో పాటు ఫ్యామిలీకి డిపెండింగ్ వీసా కూడా అందించనున్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని టామ్‌కమ్ సూచిస్తుంది.

Overseas Nursing Jobs | జర్మనీలో నర్స్ పోస్టులు.. నెలకు 3లక్షల జీతం, ఫ్యామిలీకి డిపెండెంట్ వీసా పొందే గోల్డెన్ ఛాన్స్!

Overseas Nursing Jobs | నర్సింగ్ పూర్తి చేసిన వారికి గుడ్‌న్యూస్. జర్మనీలోని ప్రముఖ ఆస్పత్రుల్లో నర్స్‌ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ (TOMCOM) ద్వారా నియామకాలు చేపడుతున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.3లక్షల వరకు జీతంతో పాటు కుటుంబంతో కలిసి ఉండటానికి అవకాశం కల్పించనున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టామ్‌కమ్ సంస్థ సూచిస్తుంది.

జీతభత్యాలు

జర్మనీలోని ప్రముఖ ఆస్పత్రుల్లో రిజిస్టర్డ్ జనరల్ నర్స్ పోస్టుల కోసం ఈ నియమకాలు చేపడుతున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలో నెలకు €2200 నుంచి €2500 వరకు ఇస్తారు. అంటే మన కరెన్సీలో రూ.2.3 లక్షల నుంచి 2.6 లక్షల వరకు ఇస్తారు. గుర్తింపు పొందిన తర్వాత నెలకు సుమారు 3 లక్షలు ( €2800) వరకు జీతం ఉంటుంది.

పనిగంటలు

వారానికి 38 నుంచి 40 గంటల పని ఉంటుంది. ఓవర్‌టైమ్ చేసుకునే సదుపాయం ఉంది. అదనంగా 20 నుంచి 35 శాతం వరకు ఓవర్‌టైమ్ అలవెన్స్‌లు అందిస్తారు.

భాష అర్హతలు

– కనీసం జర్మన్ A2 స్థాయి తెలిసి ఉండాలి. B1 స్థాయి తప్పనిసరి. ఎంపికైన అభ్యర్థులకు జర్మన్ భాష నేర్చుకునేందుకు శిక్షణ సాయం అందిస్తారు.

అదనపు ప్రయోజనాలు

– వీసా
– భార్య/భర్తకు, పిల్లలకు డిపెండెంట్ వీసా
– లాంగ్వేజ్ ట్రైనింగ్ సపోర్టు

అర్హతలు

– చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్
– ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండాలి.
– ఎలాంటి క్రిమినల్ రికార్డు ఉండకూడదు.
– జర్మన్ సంస్కృతిని అలవరచుకోగలగాలి

దరఖాస్తు విధానం

అన్ని అర్హతలు గల అభ్యర్థులు https://docs.google.com/forms/d/e/1FAIpQLSdh03Ay0oZJL28H6KKrv42cxgH_4U3CD8k_OTYbpacyWHMe-Q/viewform?pli=1 గూగుల్ డాక్యుమెంట్ ద్వారా దరఖాస్తు ఫారం నింపవచ్చు. మరిన్ని వివరాలకు 9440051581, 9440052081, 9440049645 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు.

Read More:

ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు.. పోస్టును బట్టి జీతం నెలకు రూ.1.47లక్షలు!

NIC Govt Jobs | రాత పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.1.77 లక్షల జీతం!