NIC Govt Jobs | రాత పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.1.77 లక్షల జీతం!
NIC Govt Jobs | కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC)లో సెంటిస్ట్ బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 243 సైంటిస్టు బి పోస్టులను భర్తీ చేయనున్నారు.
NIC Govt Jobs | కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC)లో సెంటిస్ట్ బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 243 సైంటిస్టు బి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. కేవలం గేట్ స్కోర్ (GATE Jobs) ఆధారంగానే ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఏప్రిల్ 24వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ – 168 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ – 25 పోస్టులు
డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – 50 పోస్టులు
అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా సైన్స్‌లో డిగ్రీ/పీజీ ఉండాలి. ముఖ్యంగా GATE 2024, 2025, 2026లో మంచి స్కోర్ ఉండాలి. ఎలాంటి అనుభవం అక్కర్లేదు. కేవలం గేట్ స్కోర్ ఆధారంగానే అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అనంతరం తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. తుది ఎంపికలో గేట్ స్కోర్‌కు 60 శాతం, ఇంటర్వ్యూకు 40 శాతం వెయిటేజ్ ఉంటుంది.
వయోపరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 30 సంవత్సరాలు కాగా.. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు ఉంటాయి. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది. ఇతరులు రూ.800 చెల్లించాల్సి ఉంటుంది.
జీతభత్యాలు
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఏడో వేతన కమిషన్ ప్రకారం నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతం ఇవ్వనున్నారు. దీంతో పాటు ఇతర భత్యాలు కూడా వర్తిస్తాయి.
Read More:
10th, ఐటీఐతో ఇండియన్ రైల్వేలో జాబ్స్.. 11,127 పోస్టులతో భారీ నోటిఫికేషన్.. ఎలా అప్లై చేసుకోవాలంటే..!
ఒమన్‌లో నెలకు రూ.20 లక్షల జీతంతో జాబ్.. వెంటనే అప్లై చేసుకోండి!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram