RRB Railway Jobs | 10th, ఐటీఐతో ఇండియన్ రైల్వేలో జాబ్స్.. 11,127 పోస్టులతో భారీ నోటిఫికేషన్.. ఎలా అప్లై చేసుకోవాలంటే..!

RRB Railway Jobs | నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ రైల్వేలో 11,127 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

RRB Railway Jobs | 10th, ఐటీఐతో ఇండియన్ రైల్వేలో జాబ్స్.. 11,127 పోస్టులతో భారీ నోటిఫికేషన్.. ఎలా అప్లై చేసుకోవాలంటే..!

RRB Railway Jobs | నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ రైల్వేలో 11,127 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతితో పాటు ఐటీఐ లేదా డిప్లొమో ఉత్తీర్ణత సాధించాలి.

అర్హతలు – వయోపరిమితి

అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి లేదా ఐటీఐ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్), డిప్లొమో ( మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్) చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయోపరిమితి ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు మే 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 14వ తేదీ దరఖాస్తుకు తుది గడువు అని ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఎంపిక – వేతనం

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సీబీటీ1, సీబీటీ 2 రాత పరీక్షలు, అప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనం రూ.19,900 కాగా.. అలవెన్స్‌లు అన్ని కలుపుకుంటే రూ.25వేల నుంచి 35 వేల వరకు వేతనం అందుకోవచ్చు.

దరఖాస్తు విధానం

ముందుగా rrbapply.gov.in రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. వెబ్‌సైట్‌లో అప్లై సెక్షన్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సంబంధిత ఫామ్ నింపి ఫొటో, సంతకం, సర్టిఫికెట్లు వంటి డాక్యుమెంట్‌లు అప్‌లోడ్ చేయాలి. అనంతరం ఫీజు చెల్లించి సబ్‌మిట్ చేయాలి.

రైల్వే రీజియన్లవారీగా ఖాళీల వివరాలు

సెంట్రల్ రైల్వే 1,400
ఈస్ట్ కోస్ట్ రైల్వే 1,625
సౌత్ ఈస్ట్రన్ రైల్వే 1,531
నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ 1,276
నార్తర్న్ రైల్వే 740
ఈస్ట్ సెంట్రల్ రైల్వే 700
సౌత్ సెంట్రల్ రైల్వే 674
నార్త్ వెస్ట్రన్ రైల్వే 600
ఈస్టర్న్ రైల్వే 608
వెస్ట్ సెంట్రల్ రైల్వే 541
నార్త్ సెంట్రల్ రైల్వే 457
సౌత్ ఈస్ట్ సెంట్రల్ 200
సౌత్ వెస్ట్రన్ రైల్వే 200
సదర్న్ రైల్వే 250
వెస్టర్న్ రైల్వే 214
నార్త్ ఈస్ట్రన్ రైల్వే 105
CLW (లోకో వర్క్స్) 06

Read More:

Pune Techie | 47 లక్షల జాబ్ రిజెక్ట్ చేసిన టెక్కీ.. అసలు కారణం తెలిస్తే షాకవుతారు!

ఒమన్‌లో నెలకు రూ.20 లక్షల జీతంతో జాబ్.. వెంటనే అప్లై చేసుకోండి!

టామ్‌కమ్ ద్వారా ఒమన్‌లో భారీ జాబ్స్.. నెలకు 22 లక్షల జీతం