Germany Jobs | నెలకు రూ.3లక్షల జీతంతో జర్మనీలో ఉద్యోగాలు.. టామ్‌కామ్ ద్వారా భర్తీ.. రేపే ఇంటర్వ్యూలు

Germany Jobs | కమర్షియల్ వెహికల్ టెక్నీషియన్, అగ్రికల్చర్&కన్‌స్ట్రక్షన్ మెషినరీ టెక్నీయన్లకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ టామ్‌కామ్(TOMCOM) ద్వారా భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

Reported by: Chandram | విద్య - ఉద్యోగం | Apr 19, 2026, 6:40 am IST
Read Time: 4 mins
Germany Jobs | నెలకు రూ.3లక్షల జీతంతో జర్మనీలో ఉద్యోగాలు.. టామ్‌కామ్ ద్వారా భర్తీ.. రేపే ఇంటర్వ్యూలు

Germany Jobs | కమర్షియల్ వెహికల్ టెక్నీషియన్, అగ్రికల్చర్&కన్‌స్ట్రక్షన్ మెషినరీ టెక్నీయన్లకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ టామ్‌కామ్(TOMCOM) ద్వారా భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.3లక్షల వరకు జీతం అందించనున్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టామ్‌కామ్ అధికారులు సూచిస్తున్నారు.

అర్హత

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటీఐ/డిప్లొమో/బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 3 సంవత్సరాల అనుభవం అవసరం. అభ్యర్థులు 21 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే జర్మన్ భాష రావడం తప్పనిసరి. కనీసం A2 లెవల్, B1 ఉన్నప్పటికీ ప్రాధాన్యం ఇస్తారు.

జీతభత్యాలు

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.3లక్షల వరకు వేతనం అందించనున్నారు. వీసా ఖర్చులను కంపెనీనే భరిస్తుంది. ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు ఓవర్‌టైమ్ కూడా చేసుకోవచ్చు.

ఉద్యోగ బాధ్యతలు

వాహనాలు, హెవీ మిషనరీల మెయింటెనెన్స్ చేసుకోవాలి. రిపేర్ చేయగలగాలి. మెకానికల్, ఎలక్ట్రికల్ సమస్యలను పరిష్కరించగలగాలి. ట్రక్కులు, కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంటట్‌పై పనిచేయాలి. భద్రతా ప్రమాణాలు పాటించాలి.

రేపే ఇంటర్వ్యూలు

ఆసక్తి గల అభ్యర్థులు పై ఫొటోలని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దరఖాస్తు చేయవచ్చు. లేదంటే tomcom.resume@gmail.com మెయిల్ అడ్రస్‌కు రెస్యుమ్‌లను పంపవచ్చు. ఈ ఉద్యోగాల కోసం ఏప్రిల్ 20 ( సోమవారం)వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ మల్లేపల్లిలోని ఐటీఐ క్యాంపస్‌లో ఉన్న టామ్‌కామ్ కార్యాలయంలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం 9440051285, 944051452 నంబర్లలో సంప్రదించవచ్చు.

Read More:

Overseas Nursing Jobs | ఖతార్‌లో నర్సింగ్ ఉద్యోగాలు.. నెలకు రూ.1.21లక్షల ట్యాక్స్ ఫ్రీ జీతం.. రవాణా, వసతి కూడా ఫ్రీ!