Overseas Nursing Jobs | ఖతార్‌లో నర్సింగ్ ఉద్యోగాలు.. నెలకు రూ.1.21లక్షల ట్యాక్స్ ఫ్రీ జీతం.. రవాణా, వసతి కూడా ఫ్రీ!

Overseas Nursing Jobs | విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నర్సింగ్ ఉద్యోగులకు మంచి అవకాశం వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ టామ్‌కామ్ (TOMCOM) ఆధ్వర్యంలో ఖతార్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

Reported by: Chandram | విద్య - ఉద్యోగం | Apr 12, 2026, 6:38 am IST
Read Time: 4 mins
Overseas Nursing Jobs | ఖతార్‌లో నర్సింగ్ ఉద్యోగాలు.. నెలకు రూ.1.21లక్షల ట్యాక్స్ ఫ్రీ జీతం.. రవాణా, వసతి కూడా ఫ్రీ!

Overseas Nursing Jobs | విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నర్సింగ్ ఉద్యోగులకు మంచి అవకాశం వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ టామ్‌కామ్ (TOMCOM) ఆధ్వర్యంలో ఖతార్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన మహిళలు, పురుషులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని టామ్‌కామ్ సంస్థ అధికారులు తెలిపారు.

అర్హతలు

ఎంపికైన అభ్యర్థులను ఖతార్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో హోమ్ కేర్ నర్సులుగా నియమించనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా GNM లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేయాలి. అలాగే కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.

జీతభత్యాలు

ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు సుమారు 5 వేల ఖతార్ రియాల్స్ జీతంగా ఇవ్వనున్నారు. అంటే మన కరెన్సీలో రూ.1.21 లక్షలపైనే ఉంటుంది. జీతంతో పాటు అదనంగా ఉచిత వసతి, రవాణా, మెడికల్ ఇన్సూరెన్స్, విమాన టికెట్లు వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. ముఖ్యంగా ట్యాక్స్ ఫ్రీ జీతం కాబట్టి.. వచ్చిన డబ్బులో ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.

దరఖాస్తు విధానం – ఇంటర్వ్యూలు

ఈ నియామక ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు గూగుల్ ఫామ్ నింపడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం tomcomglobal@gmail.com, tomcomjrassistant@gmail.com మెయిల్‌కు సంప్రదించవచ్చు. లేదా 8919047600 / 94400 51763 నంబర్లకు కాల్ చేయవచ్చు.

ఈ నియామక ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ఇంటర్వ్యూల ద్వారా నిర్వహించబడుతుందని టామ్‌కామ్ అధికారులు వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇచ్చిన గూగుల్ ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఇమెయిల్ లేదా ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.

Read More:

Overseas Nursing Jobs | జర్మనీలో నర్స్ పోస్టులు.. నెలకు 3లక్షల జీతం, ఫ్యామిలీకి డిపెండెంట్ వీసా పొందే గోల్డెన్ ఛాన్స్!

Overseas Jobs | ఇంటర్ అర్హతతోనే ఒమన్‌లో జాబ్స్.. నెలకు రూ.80వేల జీతం!