AP Job Calendar 2026 : నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్
ఉగాది సందర్భంగా ఏపీ ప్రభుత్వం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. గ్రూప్-1, గ్రూప్-2 వివిధ శాఖల్లో నోటిఫికేషన్ తేదీలను మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
అమరావతి : ఉగాది పర్వదినోత్సవం వేళ ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇకపై ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ల తేదీలు వెల్లడించారు.
జాబ్ క్యాలెండర్ మేరకు ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టుల భర్తీకి మే 15న, 91 గ్రూప్-1 పోస్టులకు ఆగస్టు 15న, హోంశాఖలో 2,778 పోస్టులకు ఆగస్టు 15న, 750 గ్రూప్-2 పోస్టులకు సెప్టెంబర్ 15న, 503 ఏఈఈ పోస్టులకు సెప్టెంబర్ 15న, పాఠశాల, ఇంటర్ విద్యకు చెందిన 3,004 పోస్టులకు అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదల కానుండటం విశేషం.
యువగళం పాదయాత్ర హామీ నెరవేర్చాం : నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నాం అని మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తెలిపారు. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాం అని పేర్కొన్నారు. ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు అని తెలిపారు. ఇక ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇక మీరు పోటీపరీక్షలకు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు అని లోకేశ్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి :
భారత కమ్యూనిస్టు ఉద్యమం పై రెండో గ్రేట్ డిబేట్
Jamili Elections : జమిలి ఎన్నికల కమిటీ గడువు పొడిగింపు !
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram