ఎల్పీజీ ఎఫెక్ట్.. ఈరోజు నుండి ఈ ఫుడ్స్ పెట్టలేం!
ఎల్పీజీ గ్యాస్ కొరతతో దేశవ్యాప్తంగా హోటల్స్, హాస్టల్స్‌లో ఆహార పరిమితులు విధిస్తున్నారు. హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్స్‌లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ నిలిపివేస్తున్నట్టు నోటీసులు వైరల్ అయ్యాయి.
విధాత, హైదరాబాద్ : ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్దంతో పశ్చిమాసియా నుంచి భారత్ కు చమురు, గ్యాస్ దిగుమతిలో నెలకొన్న ఆటంకాలు దేశీయంగా వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా దేశ వ్యాప్తంగా నగరాలు, పట్టణాలలో హోటల్స్, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల పరిమిత సమయం మేరకు హోటల్స్, రెస్టారెంట్లను నడిపిస్తున్నారు. ఢిల్లీ, ముంబాయ్, బెంగుళూర్, చైన్నై వంటి నగరాల్లో చమురు, ఎల్పీజీ గ్యాస్ కొరత సమస్య అధికంగా కనిపిస్తుంది. వంట గ్యాస్ కొరతతో హోటల్స్, రెస్టారెంట్స్ మూతపడితే ఆటోమేటిక్ గా స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు కూడా తగ్గిపోతుండటంతో గిగ్ వర్కర్ల ఉపాధి కూడా పడిపోతుంది.
హాస్టల్స్ వంటలలో పరిమితులు..వైరల్ గా ప్రకటన
ఎల్పీజీ గ్యాస్ కొరత సమస్య చివరకు విద్యార్థుల హాస్టల్స్, వర్కింగ్ హాస్టల్స్ పైన ప్రభావం చూపుతుంది. వంట గ్యాస్ కొరత నేపథ్యంలో హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ విద్యార్థులకు కేవలం ముఖ్యమైన ఆహార పదార్థాలు మాత్రమే సరఫరా చేస్తామని చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వంట గ్యాస్ కొరత కారంణంగా ఎక్కువ టైమ్ తీసుకునే చపాతీ, పూరి లాంటి వంటకాలు ఉండవని, కొన్ని కూరలు, ఎక్స్‌ట్రా ఫుడ్ ఐటమ్స్ బంద్ పెడుతున్నామని నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయడం సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. అంతేకాదు ఏలాగు మేం వండి పెట్టడం లేదు కదా అని…సొంతంగా వంట చేసుకోవడానికి వీల్లేదు అంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని హాస్టల్స్ యాజమాన్యాలు తమ నోటీసు బోర్డులలో స్పష్టం చేశాయి. ఇందుకు సంబంధించిన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా..నెటిజన్లు ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. చివరకు టీ, కాఫీలు సైతం అందించబోమంటూ..పరిస్థితిని అర్ధం చేసుకుని సహకరించాలంటూ ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ వెల్లడించడం చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి :
Hyderabad Hotels | వంట గ్యాస్ కొరత.. మరో 48 గంటల్లో హైదరాబాద్‌లో హోటల్స్ బంద్..!
IRCTC Andaman Package | హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram