LPG Gas Saving Tips | ఎల్‌పీజీ సంక్షోభం.. మీ గ్యాస్ సిలిండర్ త్వరగా ఖాళీ అవుతుందా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఆదా చేయొచ్చు!
LPG Gas Saving Tips | మీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ త్వరగా ఖాళీ అవుతుందా? వంట చేసేప్పుడు సింపుల్ టిప్స్ పాటిస్తే ఎల్‌పీజీ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే సిలిండర్ డెలివరీ సమయంలో బరువు చెక్ చేస్తే మోసాలను తగ్గించుకోవచ్చు.
LPG Gas Saving Tips | భారత్‌లో ఎల్‌పీజీ గ్యాస్ కొరత ( LPG Gas Crisis ) ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. వాణిజ్య సిలిండర్లు సరిపడా అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్, ముంబై, బెంగళూరు సహా దేశంలోని పలు నగరాల్లో హోటళ్లను తాత్కాలికంగా మూసివేశారు. తొందరలోనే గృహ వినియోగ వంట గ్యాస్ ( Cooking Gas ) విషయంలో కూడా కొరత వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మన ఇంట్లో ఉన్న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే ఏం చేయాలి? ఎలాంటి టిప్స్ పాటించాలి? సిలిండర్ డెలివరీ సమయంలో జరిగే మోసాలను ఎలా అరికట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..
డెలివరీ సమయంలో ఇలా చెక్ చేసుకోండి
ఎల్‌పీజీ సిలిండర్ డెలివరీ సమయంలో గ్యాస్ తక్కువగా ఉందనే ఆరోపణలు చాలా వినిపిస్తుంటాయి. అయినప్పటికీ సిలిండర్ డెలివరీ సమయంలో చాలామందిని పట్టించుకోరు. సీల్ ఒక్కటి సరిగ్గా ఉందో లేదో చూసి వదిలేస్తారు. కానీ వాస్తవానికి సిలిండర్ తీసుకునేప్పుడు బరువు సరిగ్గా ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవడం మంచింది.
ఎల్‌పీజీ సీలిండర్ బరువు ఎంత ఉండాలంటే
మొత్తం బరువు 29.7కిలోలు
గ్యాస్ బరువు 14.2 కిలోలు
ఖాళీ సిలిండర్ బరువు 15.5 కిలోలు
మనం సిలిండర్ డెలివరీ తీసుకునే సమయంలో ఈ బరువు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. గ్యాస్ సిలిండర్ తూకం వేసుకోవడానికి పెద్ద పెద్ద యంత్రాలు ఏమీ అక్కర్లేదు. ప్రయాస కూడా పడాల్సిన అవసరం లేదు. కేవలం రూ.300 లోపు లభించే హుక్ టైప్ వెయింగ్ మెషిన్‌తో మనమే స్వయంగా బరువు చెక్ చేసుకోవచ్చు.
వంట గ్యాస్ ఎక్కువ రోజులు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- తక్కువ లేదా మధ్యస్థ మంటపైనే వంట చేసుకోవాలి. అవసరం లేకుండా ఎక్కువ మంట ఉపయోగిస్తే గ్యాస్ తొందరగా ఖాళీ అవుతుంది.
- బియ్యం, పప్పులు, ఇతర ధాన్యాలు వండుకునే ముందు ఎక్కువసేపు నానబెట్టాలి. ఇలా చేస్తే త్వరగా ఉడుకుతాయి. దీనివల్ల చాలావరకు గ్యాస్ అవుతుంది. నానబెట్టడం వల్ల గ్యాస్ ఆదా కావడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
- వెడల్పాటి పాత్రల్లో వంట చేయడం వల్ల వంట గ్యాస్ ఆదా అవుతుంది. పెద్ద పాత్రలను బర్నర్‌పై పెట్టినప్పుడు మంట మొత్తం గిన్నె అడుగు భాగానికి తాకుతుంది. దానివల్ల మంట వృథా కాదు.. అదే చిన్న పాత్రలను పెద్ద బర్నర్‌పై పెడితే వేడి వృథా అవుతుంది.
- వంట చేసేటప్పుడు గిన్నెలపై మూత పెట్టాలి. దీనివల్ల గిన్నె లోపలి వేడి లోపలే ఉంటుంది. దీనివల్ల వంట త్వరగా పూర్తవుతుంది.
- చాలామంది వంట చేస్తుండగా మధ్యలో కూరగాయలు కట్ చేయడం, వంట సామగ్రి కోసం వెతకడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పొయ్యి మీద గిన్నె వేడి అవుతూనే ఉంటుంది. తద్వారా గ్యాస్ కూడా వృథా అవుతుంది. కాబట్టి వంట మొదలుపెట్టడానికి ముందే అన్ని కూరగాయలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే వంటకు అవసరమైన సామగ్రి మొత్తం దగ్గర పెట్టుకోవాలి.
- బర్నర్లపై మసి పేరుకుపోవడం వల్ల అవి మూసుకుపోతాయి. అప్పుడు మంట సరిగ్గా రాదు. దీంతో వంట చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. వంట గ్యాస్ కూడా వృథా అవుతుంది.
- వంట చేసేటప్పుడు తడి పాత్రలను కూడా పొయ్యి మీద పెట్టకూడదు. ఒకవేళ అలా పెడితే గిన్నెలో ఉన్న నీరు ఆవిరి కావడానికి అదనంగా గ్యాస్ ఖర్చవుతుంది.
- వంట చేయడానికి పూర్తిగా గ్యాస్‌పై ఆధారపడకుండా ఎలక్ట్రిక్ ఉత్పత్తులను కూడా వాడొచ్చు. వంట చేయడానికి ఎలక్ట్రిక్ కుక్కర్లను వాడుకోవచ్చు. గుడ్లను ఉడకబెట్టడానికి, నీటిని వేడి చేయడానికి కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ప్రత్యామ్నయంగా వినియోగించవచ్చు.
Read More :
Hyderabad Hotels | వంట గ్యాస్ కొరత.. మరో 48 గంటల్లో హైదరాబాద్‌లో హోటల్స్ బంద్..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram