Auto Drivers Protest In Hyderabad | ఎల్పీజీ కొరతపై భగ్గుమన్న ఆటో కార్మికులు

తెలంగాణలో ఎల్పీజీ కొరత తీవ్రంగా మారడంతో హైదరాబాద్ నాచారం వద్ద ఆటో కార్మికులు నిరసనకు దిగారు. గ్యాస్ లేక జీవనోపాధి కష్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Apr 01, 2026, 1:22 pm IST
Read Time: 2 mins
Auto Drivers Protest In Hyderabad | ఎల్పీజీ కొరతపై భగ్గుమన్న ఆటో కార్మికులు

విధాత, హైదాబాద్ : పశ్చిమాసియ యుద్ద సంక్షోభం నేపథ్యంలో తెలంగాణలో ఎల్పీజీ ఆధారిత ఆటోలు, వాహనాలకు గ్యాస్ సరఫరా కొరతపై ఆటో కార్మికులు భగ్గుమన్నారు. ఆటోలు నడిపేందుకు అవసరమైన ఎల్పీజీ గ్యాస్ అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపిస్తూ హైదరాబాద్ నాచారం చౌరస్తాలో ఆటో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎల్‌పీజీ కొరతతో తాము ఆటోలు నడుపలేక..జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వచ్చిందని ఆటో కార్మికులు వాపోయారు. గత నెల రోజుల నుంచి ఎల్‌పీజీ గ్యాస్ కోసం తీవ్రఇబ్బందులు పడుతున్నామని, బంక్ ల వద్ద గంటల తరబడిగా బారులు తీరినా..గ్యాస్ దొరకడం లేదని తెలిపారు. ఎల్‌పీజీ గ్యాస్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి :

Commercial Gas | భారీగా పెరిగిన క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు..!
LPG Shortage | ఆయిల్ కంపెనీలపై అంతులేని ప్రేమ… నిద్రపోతున్న పౌర సరఫరాల విభాగం