• Telugu News
  • /National

స్కూల్ బస్సుపై చెట్టు పడి విద్యార్థి మృతి..కొడుకు కోసం క్రికెట్ బ్యాట్ తో తల్లి ఎదురుచూపు !

స్కూల్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన తన కొడుకు తిరిగొస్తాడంటూ.. అతని కోసం క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఇంటి బయట కూర్చుని తల్లి ఎదురుచూస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కదిలించివేస్తుంది. తను ఎంతగానో ప్రేమించే కొడుకు మరణవార్తను ఆ తల్లి నమ్మలేకపోతుండటం కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగువారిని కూడా కంట తడి పెట్టిస్తుంది.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Jul 01, 2026, 3:01 pm IST
Read Time: 3 mins
స్కూల్ బస్సుపై చెట్టు పడి విద్యార్థి మృతి..కొడుకు కోసం క్రికెట్ బ్యాట్ తో తల్లి ఎదురుచూపు !

విధాత : విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సుపై అకస్మాత్తుగా ఓ భారీ వృక్షం కూడిపడిన ఘటనలో ఓ విహాన్ (11) విద్యార్థి మృతి చెందగా..బస్సులోని మిగతా 10మంది విద్యార్ధులకు గాయాల్యాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చెంబూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు అయ్యింది. అయితే తన కుమారుడి మరణం వార్తతో విహాన్ తల్లి జూహి షాక్ కు గురైంది.

తన కొడుకు తిరిగొస్తాడంటూ.. అతని కోసం క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఇంటి బయట కూర్చుని ఎదురుచూస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కదిలించివేస్తుంది. తను ఎంతగానో ప్రేమించే కొడుకు మరణవార్తను ఆ తల్లి నమ్మలేకపోతుండటం కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగువారిని కూడా కంట తడి పెట్టిస్తుంది. మరోవైపు ప్రమాదంలో గాయపడిన విద్యార్ధులలో మరొకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.