పశ్చిమాసియాలో యుద్ధంతో భారత్‌కు సమస్యలు: ప్రధాని మోదీ
పశ్చిమాసియా యుద్ధం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రధాని మోదీ హెచ్చరిక. ఇంధన సరఫరా, వాణిజ్య రంగాల్లో సమస్యలు ఎదురవుతున్నాయని లోక్‌సభలో వెల్లడించారు.
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో భారత్ కు అనేక సమస్యలు వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లోక్ సభలో పశ్చిమాసియా యుద్దంపై మోదీ ప్రకటన చేశారు. పశ్చిమాసియా యుద్ద ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడుతుందని, భారత్ కు ఈ యుద్దం ఎన్నో సవాళ్లను తీసుకొచ్చిందని తెలిపారు. యుద్ద పరిస్థితులను గమనిస్తున్నామని, గల్ఫ్ దేశాల్లో యుద్ధం వల్ల మన దేశంలో అనేక సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు.
యుద్ధంతో ఆర్థిక, వాణిజ్యపరమైన అంశాలపై అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం అని తెలిపారు. భారత్ కు ఎక్కువగా గల్ఫ్ నుంచే ముడిచమురు, గ్యాస్ వస్తోంది అని, వాటి సరఫరా లింక్ లో ఆటంకాలతో దేశీయంగా కొరత ఏర్పడుతుందన్నారు. యుద్ధం వల్ల ఇతర దేశాలతో జరిగే వాణిజ్యం దెబ్బతింటోందని, ముడిచమురు సముద్ర మార్గం ద్వారానే తెచ్చుకుంటున్నాం అని స్పష్టం చేశారు. ప్రజలకు పెట్రోల్, గ్యాస్ కొరత లేకుండా చూస్తున్నాం అని, 60% ఎల్పీజీని భారత్ లో ఉత్పత్తి చేస్తున్నాం అని వెల్లడించారు. 41 దేశాల నుంచి ఇంధన కొంటున్నాం అని, 53 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. రైల్వేలో విద్యుధీకరణతో 180కోట్ల విలువైన ఇంధనం ఆదా అయ్యిందన్నారు.
పశ్చిమాసియ యుద్దంతో ప్రపంచానికి ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉంది అని, భారత్ పై మాంద్యం ప్రభావం లేకుండా చూస్తున్నాం అని మోదీ తెలిపారు. ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాం అని, కరోనా సమయంలోను ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం అని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు డీజిల్ కొరత లేకుండా చూస్తాం అని, పవర్ ప్లాంట్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రతిరోజు పశ్చిమాసియా దేశాల అధ్యక్షులతో మాట్లాడుతున్నాను అని వెల్లడించారు. యుద్ధాన్ని ఆపడానికి నా వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. గల్ఫ్ లో కోటి మంది భారతీయులు ఉన్నారు అని, భారతీయులను కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, భారతీయుల కోసం హెల్ప్ లైన్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. ఇప్పటికే 3లక్షల 75,000 మందిని సురక్షితంగా భారత్ కు తరలించమాని, ఇరాన్ నుంచి 100 మందిని తరలించినట్లుగా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి :
Danam Nagendra : ఫిరాయింపు పర్వం… దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు
ఆరు నూరైనా ఆయన ఈ రోజు కోర్టులో హాజరుకావాల్సిందే: హైకోర్టు జడ్జీ రాజేశ్వర రావు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram