Ys Jagan | వైఎస్ జగన్ నోట భగవద్గీతా ప్రవచనం!

వైఎస్ జగన్ కృష్ణాష్టమి సందర్బంగా భగవద్గీతా శ్లోకంతో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అవుతూ రాజకీయ చర్చలకు దారితీసింది.

ys-jagan-bhagavad-gita-krishnashtami-tweet-viral

Ys Jagan | అమరావతి : వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) నోట భగవద్గీతా(Bhagvat Gita) ప్రవచం వెలువడటం వైరల్ గా మారింది. శ్రీకృష్ణ జన్మాష్టమి(Sri Krishna Janmashtami) పురస్కరించుకుని జగన్ ఎక్స్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం..ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతం. శ్రీ కృష్ణుడి జీవితం దీనికి నిదర్శనం. ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్ట‌మి శుభాకాంక్ష‌లు తెలిపారు. వైఎస్ జగన్ ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది.

అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయంతో పాటు తాజాగా సొంత గడ్డ పులివెందుల జడ్పీటీసీ, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో జగన్ వేదాంత తాత్విక ధోరణిలో కృష్ణాష్ట‌మి ట్వీట్ చేశారని కొందరు..వరుస ఓటములతో ఇలాంటి వేదాంతమే పుట్టుకొస్తుందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.