Vivo T5x 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) భారత మార్కెట్‌లోకి మరో కొత్త మొబైల్ ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. T సిరీస్‌లో భాగంగా Vivo T5x 5జీ మోడల్‌ను రేపు ( మార్చి 17వ తేదీన )అధికారికంగా లాంచ్ చేయనుంది. ఇప్పటికే వచ్చిన లీకుల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7200mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉండే అవకాశం ఉందని సమాచారం. అలాగే మీడియాటెక్ చిప్‌సెట్, అధిక రీఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో వస్తున్న ఈ మొబైల్ మీడిల్ రేంజ్ ఫోన్లలో గట్టి పోటీనిస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
రెండు కలర్ ఆప్షన్లు
భారత్‌లో మార్చి 17వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు Vivo T5x 5G మొబైల్‌ను లాంచ్ చేయనున్నట్లు వివో కంపెనీ ప్రకటించింది. ఈ మొబైల్ ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ సైబర్ గ్రీన్, స్టార్ సిల్వర్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అంతేకాదు 8జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌తోనూ ఈ మోడల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ధర 23 వేల లోపే
ఇప్పటివరకు ఈ మోడల్ ధరను వివో ప్రకటించలేదు. కానీ ఇది రూ.10 వేల నుంచి 23 వేల వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనికంటే ముందు మోడల్ అయిన Vivo T4x 5G మొబైల్ ధరల విషయానికొస్తే 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజి వేరియంట్ ధర రూ.13,999గా నిర్ణయించారు. అలాగే 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజి వేరియంట్ ధరను రూ.14,999గా, 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజి వేరియంట్ ధరను రూ.16,999గా నిర్ణయించారు. దీన్నిబట్టి చూస్తే Vivo T5x 5G మొబైల్ ధర కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
డిజైన్ పరంగా Vivo T5x 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ బ్యాక్‌ప్యానెల్‌తో వస్తుంది. వెనుక భాగంలో స్క్వైర్ ఆకారంలో కెమెరా మాడ్యూల్ ఉండి అందులో రెండు కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్, రింగ్ లైట్ అమర్చారు. దీంతో పాటు ఫోన్ కుడివైపు పవర్ బటన్, వాల్యూమ్ బటన్లు ఉంటాయి. ముందు భాగంలో పిల్ షేప్ కటవుట్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది సెల్ఫీ కెమెరాల కోసం ఉపయోగపడుతుంది.
లీకైన వివరాల ప్రకారం మరిన్ని స్పెసిఫికేషన్లు
* 6.72 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే
* 1080 × 2400 పిక్సెల్ రిజల్యూషన్
* 120Hz రీఫ్రెష్ రేట్
* 1250 నిట్స్ బ్రైట్‌నెస్
* మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌సెట్
* ఆక్టా కోర్ ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS 6 ఆపరేటింగ్ సిస్టమ్
కెమెరా స్పెసిఫికేషన్లు
ఇక కెమెరా విషయానికొస్తే డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. వెనుకవైపు 50 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు, 2 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటుంది. అలాగే ముందు భాగంలో 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది 4K వీడియో రికార్డింగ్ (30fps) వరకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది.
భారీ బ్యాటరీ
ఇక ఈ మొబైల్ భారీ బ్యాటరీతో వస్తుంది. ఇందులో 7200 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని వినియోగించారు. ఇది 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జి చేస్తే..
* 40 గంటల వీడియో ప్లేబ్యాక్,
* 93 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్,
* 15 గంటల గేమింగ్,
*18 గంటల సోషల్ మీడియా బ్రౌజింగ్ చేయొచ్చు.
అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు మార్చి 17న జరిగే లాంచ్ ఈవెంట్‌లో అధికారికంగా వెల్లడికానున్నాయి.
Read More :
వాట్సాప్‌లో భారీ అప్‌డేట్.. కొత్తగా మెటా ఏఐ ట్యాబ్, పేరెంట్స్ కోసం స్పెషల్ ఫీచర్!
స్టూడెంట్స్ కోసం చవకైన 5జీ ఫోన్.. ఒప్పో కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే?
తక్కువ ధరలోనే అదిరిపోయే బ్యాటరీ ఫీచర్లతో 5జీ స్మార్ట్‌ఫోన్.. పవర్ బ్యాంక్‌లా కూడా వాడొచ్చు!
