POCO C85x 5G | తక్కువ ధరలోనే అదిరిపోయే బ్యాటరీ ఫీచర్లతో 5జీ స్మార్ట్‌ఫోన్.. పవర్ బ్యాంక్‌లా కూడా వాడొచ్చు!

POCO C85x 5G | పవర్ బ్యాంక్‌తో అవసరం లేకుండా మీ మొబైల్, ఇతర గ్యాడ్జెట్లను చార్జ్ చేసుకునేలా సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ సబ్ బ్రాండ్ అయిన పోకో POCO C85x 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది.

POCO C85x 5G | తక్కువ ధరలోనే అదిరిపోయే బ్యాటరీ ఫీచర్లతో 5జీ స్మార్ట్‌ఫోన్.. పవర్ బ్యాంక్‌లా కూడా వాడొచ్చు!

POCO C85x 5G | పవర్ బ్యాంక్‌తో అవసరం లేకుండా మీ మొబైల్, ఇతర గ్యాడ్జెట్లను చార్జ్ చేసుకునేలా సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ సబ్ బ్రాండ్ అయిన పోకో POCO C85x 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. పెద్ద స్క్రీన్, భారీ బ్యాటరీని కోరుకునే మధ్యతరగతి కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్ తీసుకొచ్చినట్లు పోకో కంపెనీ తెలిపింది. 6300mAh బ్యాటరీతో వస్తున్న ఈ మొబైల్‌ను బ్యాటరీ కా కిలాడీగా చెబుతోంది.

ఈ POCO C85x 5G మొబైల్ మార్చి 10వ తేదీన భారత మార్కెట్‌లో విడుదలైంది. కేవలం రూ.10,999గా ఈ మొబైల్ ధరను నిర్ణయించారు.
ఇది మూడు కలర్లలో అందుబాటులోకి వచ్చింది. బ్లాక్, గోల్డ్, గ్రీన్ కలర్లలో ఈ మొబైల్ దొరుకుతుంది. ఇక POCO C85x 5G ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ ర్యామ్+64జీబీ మొబైల్ ధరను రూ.10,999గా నిర్ణయించారు. ఇక 4జీబీ ర్యామ్+128జీబీ మొబైల్ ధరను రూ.11,999గా నిర్ణయించారు. మార్చి 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్ అమ్మకాలు ప్రారంభమవుతాయి.

POCO C85x 5G మొబైల్‌లో బ్యాటరీనే హైలెట్

ఈ POCO C85x 5G మొబైల్‌లో బ్యాటరీనే ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఇది 6300mAh బ్యాటరీతో వస్తుంది. అంటే ఒక్కసారి ఫుల్ చార్జి చేస్తే దాదాపు రెండు రోజుల పాటు బ్యాకప్ వస్తుందని పోకో కంపెనీ చెబుతోంది. ఇది 15W ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు అదనంగా 7.5W రివర్స్ చార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే పవర్ బ్యాంక్ తరహాలో ఈ ఫోన్‌తో ఇతర డివైస్‌లను కూడా చార్జ్ చేసుకోవచ్చు. అందుకే దీన్ని బ్యాటరీ కా కిలాడీ అని పోకో కంపెనీ చెబుతోంది.

POCO C85x 5G స్పెసిఫికేషన్లు

ఈ మొబైల్‌ 6.9 అంగుళాల హెడ్ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 120Hz AdaptiveSync రిఫ్రెష్ రేట్ ఉంది. 240Hz టచ్ సాంప్లింగ్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. అలాగే TUV రైన్‌ల్యాండ్ సిర్కాడియన్ ఫ్రెండ్లీ, లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్లు కలిగి ఉంది.

POCO C85x 5G స్మార్ట్‌ఫోన్‌ Unisoc T8300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 2.2GHz క్లాక్ స్పీడ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది 4GB LPDDR4x ర్యామ్‌తో వస్తుంది. 64జీబీ, 128 జీబీ స్టోరేజిలతో అందుబాటులో ఉంది. అలాగే మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2టీబీ వరకు స్టోరేజిని పెంచుకునే అవకాశం ఇస్తుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3పై పనిచేస్తుంది.

కెమెరా విషయానికొస్తే POCO C85x 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో వస్తుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇతర స్పెసిఫికేషన్లు

– IP52 డస్ట్, స్ప్లా్ష్ ప్రొటెక్షన్
– బ్లూటూత్ 5.4
– Wifi 5
– జీపీఎస్
– యూఎస్‌బీ టైప్ సి
– 3.5mm హెడ్‌ఫోన్ జాక్
– ఫింగర్‌ప్రింట్ సెన్సర్

Read More :

OPPO Find N6 | ఒప్పో నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!