Realme | రేపే మార్కెట్‌లోకి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. చీప్ అండ్ బెస్ట్‌ మొబైల్ కొనాలని చూసేవాళ్లకు బెస్ట్ ఆప్షన్!

తక్కువ ధరలో బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూసేవాళ్లకి గుడ్‌న్యూస్. రేపు రియల్‌మీ నుంచి c38 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుంది. 7000mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ బడ్జెట్ ధరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

Realme c38

Realme | తక్కువ ధరలో బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! రేపు అనగా మార్చి 7వ తేదీ మార్కెట్‌లోకి కొత్త 5జీ మొబైల్ రాబోతుంది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ బడ్జెట్‌ ధరలో Realme C38 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేయబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని లిస్ట్ చేసింది.

ఈ సందర్భంగా Realme C38 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అన్ని ఫీచర్లను రివీల్ చేశారు. దీని ప్రకారం.. 6.7 అంగుళాల పెద్ద ఐపీఎస్ ఎల్‌‌సీడీ డిస్‌ప్లేతో ఈ మొబైల్ వస్తుంది. అలాగే ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్టు చేస్తుంది. దీనివల్ల స్క్రోలింగ్, గేమింగ్ పర్‌ఫార్మెన్స్ మరింత పెరగనుంది. ఇక ఇందులో మీడియా‌టెక్ డైమెన్సిటీ సిరీస్ ప్రాసెసర్‌ను వినియోగించారు. ఆండ్రాయిడ్ ఆధారిత రియల్‌మీ యూఐ‌పై ఈ మొబైల్ పనిచేస్తుంది. ఫొటోగ్రఫీ కోసం 13మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. అలాగే ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం ఏఐ ఫీచర్లను కూడా జోడించారు. అలాగే 7000mAh టైటాన్ బ్యాటరీ, 15W చార్జింగ్, మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. ఇక భద్రత కోసం ఫోన్ పక్కభాగంలో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు.

ఇక విభిన్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రెండు వేరియంట్ల( 4జీబీ ర్యామ్; 6జీబీ ర్యామ్)‌తో ఈ స్మార్ట్‌ఫో‌న్‌ను తీసుకొచ్చారు. అలాగే 64జీబీ, 12జీబీ స్టోరేజీ ఆప్షన్లు ఉండనున్నాయి. ధర విషయానికొస్తే.. బేసిక్ వేరియంట్ (4జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజి) మొబైల్ ధర 13,499గా నిర్ణయించినట్లు సమాచారం. 4జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజి మొబైల్ ధర రూ.14,499, 6జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ ధర రూ.17,499గా ఉండే అవకాశం ఉంది.

ఇతర స్పెసిఫికేషన్లు

– 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
– మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్
– ఆండ్రాయిడ్ 15 + రియల్‌మీ యూఐ
– 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఏఐ ఫీచర్లు
– 7000mAh టైటాన్ బ్యాటరీ
– 720*1570 హెచ్‌డీ పిక్సెల్ రిజల్యూషన్

ఇవి కూడా చదవండి :

BJP vs Regional Parties | ప్రాంతీయ పార్టీలకు మోదీ గండం.. బీహార్‌లో నితీశ్‌ పార్టీకి ముగింపేనా!
Celebrity Marriages | సెలబ్రిటీ పెళ్లిళ్ల సందడి.. కోట్ల ఖర్చుతో హాట్ టాపిక్‌గా మారిన మూడు భారీ వివాహాలు

Latest News