Realme Narzo 100 Lite 5G | ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 34 గంటలు ఫోన్ మాట్లాడొచ్చు.. రియల్‌మీ నుంచి సరికొత్త 5జీ మొబైల్!
Realme Narzo 100 Lite 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ కొత్తగా నార్జో సిరీస్‌లో Narzo 100 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. 7000mAh భారీ బ్యాటరీతోపాటు ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.
Realme Narzo 100 Lite 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ కొత్తగా నార్జో సిరీస్‌లో Narzo 100 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. 7000mAh భారీ బ్యాటరీతోపాటు ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.
ధర ఎంతంటే..
నార్జో 100 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో మార్కెట్‌లోకి వచ్చింది. 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ మొబైల్ ధరను రూ.13,499గా నిర్ణయించింది. 4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.14,499గా, 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ ధరను రూ.16,499గా ఖరారు చేసింది.
ఏప్రిల్ 21వ తేదీ నుంచి అమెజాన్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా బ్యాంక్ డిస్కౌంట్ ద్వారా రూ.1500 వరకు తగ్గింపు వస్తుంది. ఇక ఈ మొబైల్ Frost Silver, Thunder Black కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
డిస్‌ప్లే
Narzo 100 Lite 5G మొబైల్‌లో 6.8 అంగుళాల HD+LCD డిస్‌ప్లే స్క్రీన్ ఉంది. ఇది 144Hz రీఫ్రెష్ రేట్, 900 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీంతో స్క్రీన్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుందని రియల్‌మీ సంస్థ తెలిపింది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0పై పనిచేస్తుంది. అదనంగా IP64 రేటింగ్‌తో దుమ్ము, నీటి నుంచి రక్షణ కల్పిస్తుంది.
పనితీరు
పనితీరు విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను అమర్చారు. గరిష్ఠంగా 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. microSD కార్డు ద్వారా 2టీబీ వరకు విస్తరించుకోవచ్చు. వేడికి తగ్గించేందుకు (Thermal Management) కోసం ఈ హ్యాండ్‌సెట్‌లో 5300 Sq mm హీట్ డిస్సిపేషన్ ఏరియాను కలిగిన రియల్‌మీ ఎయిర్‌ఫ్లో వేపర్ చాంబర్‌ను జోడించారు.
కెమెరా సెటప్
ఫొటోగ్రఫీ కోసం ఈ మొబైల్‌లో డ్యూయల్ రేర్ కెమెరా యూనిట్‌ను ఇచ్చారు. ఇందులో 13మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. సెకండరీ కెమెరా వివరాలను ఇంకా బహిర్గతం చేయలేదు. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 5మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో 1080p వీడియో రికార్డింగ్ సపోర్టు కూడా అందుబాటులో ఉంది.
బ్యాటరీనే మెయిన్ హైలైట్
ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా 7000mAh పవర్‌ఫుల్ బ్యాటరీని అమర్చారు. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు రివర్స్ వైర్డ్ చార్జింగ్, బైపాస్ చార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ మొబైల్‌ను ఒక్కసారి చార్జింగ్ చేస్తే 10 గంటల వీడియో ప్లే బ్యాక్, 70 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్, 34 గంటల కాలింగ్, 11 గంటల మెసేజింగ్, 12 గంటల గేమింగ్ సమయాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది.
మొత్తమ్మీద 5జీ కనెక్టివిటీతో భారీ బ్యాటరీ, మంచి డిస్‌ప్లే కలిగిన మొబైల్ చవక ధరలో కావాలని అనునకునేవారికి Narzo 100 Lite 5G మంచి ఎంపికగా నిలవనుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Read More:
Realme 16 5G | భారీ డిస్కౌంట్ ఆఫర్లతో సెల్ఫీ మిర్రర్ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..!
Motorola Edge70 Pro | మోటరోలా నుంచి సరికొత్త ఫోన్.. భారత్‌లో ఏప్రిల్ 26న లాంచ్!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram