Motorola Edge70 Pro | మోటరోలా నుంచి సరికొత్త ఫోన్.. భారత్‌లో ఏప్రిల్ 26న లాంచ్!

Motorola Edge70 Pro | భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. మోటరోలా కంపెనీ నుంచి ఎడ్జ్ 70 ప్రో సిరీస్ త్వరలో ఇండియాలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Motorola Edge70 Pro | మోటరోలా నుంచి సరికొత్త ఫోన్.. భారత్‌లో ఏప్రిల్ 26న లాంచ్!

Motorola Edge70 Pro | భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. మోటరోలా కంపెనీ నుంచి ఎడ్జ్ 70 ప్రో సిరీస్ త్వరలో ఇండియాలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫోన్‌కు సంబంధించి గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్‌పై లీకైన కొన్ని కీలక స్పెసిఫికేషన్లు ఇప్పుడు ఆసక్తిని రేకేతిస్తున్నాయి.

టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ మొబైల్ 12జీబీ ర్యామ్‌తో రానుందని తెలుస్తోంది. అలాగే ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే అవకాశం ఉంది.

పనితీరు ఎలా ఉండబోతుంది?

ఈ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉండబోతుందని గీక్‌బెంచ్ లిస్టింగ్ సూచిస్తో్ంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్‌సెట్‌గా భావిస్తున్నారు. ఇందులో నాలుగు ఎఫిషియెన్సీ కోర్స్(2.2GHz), మూడు పెర్ఫార్మెన్స్ కోర్స్ (3.2GHz), ఒక ప్రైమ్ కోర్ (3.4GHz) ఉండనున్నాయి. గ్రాఫిక్స్ కోసం Mali-G720 MC8 GPU) ఉంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గీక్‌బెంచ్ సింగిల్ కోర్ట్ టెస్ట్‌లో 1727 పాయింట్లు, మల్టీకోర్ టెస్టులో 6563 పాయింట్లు సాధించినట్లు సమాచారం.

ప్రత్యేక మైక్రోసైట్

మోటరోలా కంపెనీ తన అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ కోసం ప్రత్యేకంగా ఒక మైక్రోసైట్ కూడా అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లో ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనున్నారు. ఇక ఈ మొబైల్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. బ్లూ, గ్రీన్, వైట్ రంగుల్లో రానుంది. ఈ రంగుల వేరియంట్లు వరుసగాటైలర్డ్ ఫ్యాబ్రిక్ ఫినిష్, సాటిన్ లక్స్ ఫినిష్, మార్బుల్ ఫినిష్ వంటి ప్రత్యేక డిజైన్ ఆప్షన్లతో వస్తున్నాయి.

కెమెరా

మోటరోలా ఎడ్జ్ 70 ప్రోలో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉండబోతున్నట్లు సమాచారం. ఇది స్క్వైర్ ఆకారంలోని కెమెరా మాడ్యూల్‌లో అమర్చబడుతుంది. ముందు భాగంలో కర్వ్‌డ్ డిస్‌ప్లే, హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. అలాగే HDR10+ సర్టిఫికేషన్ కూడా పొందినట్లు సమాచారం.

ఇక ఫ్లిప్‌కార్ట్‌లో రన్ అవుతున్న మైక్రోసైట్‌ యూఆర్‌ఎల్‌లో మోటో కమింగ్ సూన్ ఏప్రిల్26 అని ఉంది. దీన్ని బట్టి ఏప్రిల్ 26వ తేదీన ఈ మొబైల్‌ను విడుదల చేయవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు. లేదంటే ఈ స్మార్ట్‌ఫోన్ పేరు, ఇతర వివరాలను వెల్లడించవచ్చని అభిప్రాయపడుతున్నారు.

Read More:

రూ.12వేలలోపే భారత్‌లోకి వచ్చేసిన రెడ్‌మీ ఏ7 ప్రో.. ఏప్రిల్ 15 నుంచి సేల్స్ షురూ!

ఎండలో ఉన్నా.. కింద పడ్డా సేఫ్‌గా ఉండే మొబైల్.. రూ.35వేలలోనే తీసుకొస్తున్న ఒప్పో