OPPO F33 | ఎండలో ఉన్నా.. కింద పడ్డా సేఫ్‌గా ఉండే మొబైల్.. రూ.35వేలలోనే తీసుకొస్తున్న ఒప్పో
OPPO F33 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి రెండు కొత్త మొబైల్‌ను తీసుకురానుంది. Oppo F33, Oppo F33 Pro అనే రెండు మోడళ్లను ఏప్రిల్ 15వ తేదీన గ్రాండ్‌గా లాంచ్ చేయనుంది.
OPPO F33 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి రెండు కొత్త మొబైల్‌ను తీసుకురానుంది. Oppo F33, Oppo F33 Pro అనే రెండు మోడళ్లను ఏప్రిల్ 15వ తేదీన గ్రాండ్‌గా లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి ఇప్పటికే కంపెనీ రివీల్ చేసిన ఫీచర్లు మిడిల్ క్లాస్ కస్టమర్లలో క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్‌ను ముఖ్యంగా సెల్ఫీ మిడ్ రేంజర్‌గా ప్రమోట్ చేస్తుండటంతో ఆసక్తి పెరిగిపోతుంది.
ఒప్పో ఎఫ్ 33 సిరీస్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు ఏఐ ఆధారిత ఫీచర్లు (AI Groupfie Expert, AI Portrait Glow) అందిస్తుంది. ముందు భాగంలో కూడా 50మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను అమర్చారు. ఇది 100 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూను కలిగి ఉండటం విశేషం. దీని ద్వారా గ్రూప్ సెల్ఫీలు తీసుకునేటప్పుడు ఫ్రేమ్‌లో ఎక్కువ మందిని కవర్ చేయడానికి ఇది ఆటోమేటిక్‌గా 0.6x మోడ్‌లోకి మారిపోతుంది. ఐఫోన్లలో ఉండే సెంటర్ స్టేజ్ ఫీచర్ తరహాలో పనిచేస్తుంది. అంటే ఫ్రేమ్‌లో ఉన్న వ్యక్తులకు తగ్గట్లుగా తనను తాసు సర్దుబాటు చేసుకుంటుంది. కాబట్టి సెల్ఫీలపై ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేవారికి ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు.
సెల్ఫీ కెమెరాలతో పాటు డ్యూరబిలిటీ మీద కూడా ఒప్పో శ్రద్ధ పెట్టింది. దీనిలో IP69K సర్టిఫికేషన్ ఉంది. అంటే అధిక పీడనంతో వచ్చే నీటి తుంపరలను, అధిక ఉష్ణోగ్రతలను కూడా ఈ ఫోన్లు తట్టుకోగలవు. కాబట్టి నిర్మాణరంగం, వ్యవసాయం వంటి ఓపెన్ ఎన్విరాన్‌మెంట్‌లో పనిచేసేవారికి ఇవి అనుకూలంగా ఉండనున్నాయి.
ఫోన్ డిజైన్ విషయానికొస్తే ఇందులో ఏరోస్పేస్ గ్రేడ్ AM04 అల్యూమినియం అలాయ్ ఫ్రేమ్ ఉపయోగించడం ద్వారా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇక స్క్రీన్ రక్షణ కోసం AGC DT STAR D+ ప్రొటెక్షన్ అందిస్తున్నారు. అలాగే ఫోన్‌లోని ముఖ్య భాగాల రక్షణకోసం ఫ్రేమ్‌లోనే ఫోమ్, సిలికాన్ ప్యాడ్‌లతో రూపొందించిన ఎయిర్ బ్యాగ్ కుషనింగ్ సిస్టమ్ అమర్చినట్లు సమాచారం. దీనివల్ల ఫోన్ కిందపడినప్పటికీ కెమెరా, స్పీకర్లు, బ్యాటరీ వంటి భాగాలకు రక్షణ దొరుకుతుంది.
బ్యాటరీ విషయానికి వస్తే ఈ సిరీస్‌లో 7000mAh పవర్‌ఫుల్ బ్యాటరీని ఉపయోగించారు. ఇది 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. సుమారు 1830 చార్జింగ్ సైకళ్ల తర్వాత కూడా ఇది 80 శాతం సామర్థ్యాన్ని నిలపుకుంటుంది. అంటే సుమారు ఐదేళ్ల పాటు దీర్ఘకాలికంగా బ్యాటరీ పనిచేస్తుందని కంపెనీవర్గాలు చెబుతున్నాయి.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎఫ్ 33 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 Max ప్రాసెసర్ ఉండనున్నట్లు సమాచారం. ఇందులో మూడు కలర్ ఆప్షన్లు వస్తున్నాయని తెలుస్తోంది. Misty Forest, Starry Blue, Passion Red వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే ఇది రూ.35 వేలలోపే ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read More:
OPPO K14x 5G | స్టూడెంట్స్ కోసం చవకైన 5జీ ఫోన్.. ఒప్పో కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram