Oppo Find X9 Ultra | డ్యూయల్ 200mp కెమెరాలు.. 10X ఆప్టికల్ జూమ్.. మైండ్ బ్లోయింగ్ ఫొటోగ్రఫీ ఫీచర్లతో ఒప్పో ఫ్లాగ్‌షిప్.. ఫొటోగ్రఫీ లవర్స్‌కి ఇక పండగే..!
Oppo Find X9 Ultra | ఫొటోగ్రఫీ లవర్స్2కు గుడ్‌న్యూస్.. డ్యూయల్ 200మెగాపిక్సెల్ కెమెరాలు, 10X ఆప్టికల్ జూమ్‌తో పాటు మైండ్‌బ్లోయింగ్ ఫొటోగ్రఫీ ఫీచర్లతో ఒప్పో తన ఫ్లాగ్‌షిప్ మొబైల్ Oppo Find X9 Ultraను తీసుకొస్తుంది. ఏప్రిల్ 21 ఈ మొబైల్ లాంచ్ కానుంది.
Oppo Find X9 Ultra | ఫొటోగ్రఫీని ఇష్టపడే వారిని టార్గెట్ చేస్తూ చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఫ్లాగ్‌షిప్ మొబైల్‌ను తీసుకొస్తుంది. డ్యూయల్ 200మెగాపిక్సెల్ కెమెరాలు, 10X ఆప్టికల్ జూమ్‌తో పాటు మైండ్‌బ్లోయింగ్ ఫొటోగ్రఫీ ఫీచర్లతో Oppo Find X9 Ultra స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. ఏప్రిల్ 21న ఈ మొబైల్‌ను లాంచ్ చేస్తున్న నేపథ్యంలో ఒప్పో కంపెనీ కీలక ఫీచర్లను వెల్లడించింది.
డ్యూయల్ 200 మెగాపిక్సెల్ కెమెరాలు
ఈ Oppo Find X9 Ultra స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ 200 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండటం ప్రధాన ఆకర్షణ. ఇవి రెండు కూడా Hasselblad ట్యూనింగ్‌తో వస్తుండటంతో ఫొటోల క్వాలిటీ మరింత మెరుగుకానుంది. ఇందులో ప్రధాన కెమెరాగా1/1.12 అంగుళాల Sony LYT-901 సెన్సార్‌ను ఉపయోగించారు. గత మోడల్‌తో పోలిస్తే 10 శాతం ఎక్కువ లైట్‌ను గ్రహించే శక్తితో వస్తుంది. అంటే f/1.5 అపర్రచర్‌తో తక్కువ లైట్‌లో కూడా అద్భుతమైన ఫొటోలను తీయగలదు.
మరో 200 మెగాపిక్సెల్ కెమెరా 1/1.28 అంగుళాల Omnivision OV52A 3x పెరిస్కోప్ టెలిఫొటో సెన్సార్‌గా పనిచేస్తుంది. Portrait Photography, Zoom Shotsలో ఇది మరింత నాణ్యతను అందించనుంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అనేక ఫ్లాగ్‌షిప్ ఫోన్ల కంటే కూడా పెద్ద సెన్సార్‌గా చెప్పవచ్చు.
10x ఆప్టికల్ జూమ్‌తో బిల్ట్ ఇన్ కెమెరా
ఈ మొబైల్‌లో 10x ఆప్టికల్ జూమ్ కోసం 50మెగాపిక్సెల్ ISOCELL JNL సెన్సార్‌ను అందిస్తున్నారు. టెలికన్వర్టర్ సపోర్టుతో 40x నుంచి 50x వరకు లాస్‌లెస్ జూమ్‌ను అందిస్తుందని ఒప్పో కంపెనీ తెలిపింది. అంటే ఇది Samsung Galaxy S26 Ultra వంటి ఫోన్లతో పోలిస్తే మరింత శక్తివంతమైన జూమ్ సామర్థ్యాన్ని అందిస్తుంది.
అల్ట్రా వైడ్ ఫొటోగ్రఫీ కోసం 50మెగాపిక్సెల్ Sony LYT-600 సెన్సార్‌ను పొందుపరిచారు. ముందుభాగంలో కూడా 50మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండటం మరో ప్రత్యేకత. ఈ రెండింటినీ 56 శాతం ఎక్కువగా లైట్‌ను గ్రహించేలా అప్‌గ్రేడ్ చేశారు.
కెమెరా స్పెసిఫికేషన్లు
* డ్యూయల్ Hasselblad 200మెగాపిక్సెల్ కెమెరాలు ( Ultra sensing, 3x Super Portrait Telephoto)
* Hasselblad 50మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా (10x ఆప్టికల్ జూమ్, 230nm ఫోకల్ లెంగ్త్)
* 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా
* 50 మెగాపిక్సెల్ లార్జ్ సెన్సార్ ఫ్రంట్ కెమెరా

ఇతర ఫీచర్లు (అంచనా)
* Snapdragon 8 Elite Gne 5 ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 16
* 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్
* 7050mAh పవర్‌ఫుల్ బ్యాటరీ
* 100W ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్
* 6.82 అంగుళాల 2K 144Hz LTP AMOLED డిస్‌ప్లే
Read More:
భారీ డిస్కౌంట్ ఆఫర్లతో సెల్ఫీ మిర్రర్ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..!
9020mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వివో స్మార్ట్‌ఫోన్.. మిడ్ రేంజ్ మొబైల్స్‌లో సంచలనం!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram