VIVO T5 Pro | 9020mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వివో స్మార్ట్‌ఫోన్.. మిడ్ రేంజ్ మొబైల్స్‌లో సంచలనం!

VIVO T5 Pro | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో త్వరలోనే మరో శక్తివంతమైన మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది. Vivo T5 Pro 5జీ మొబైల్‌ను తీసుకురాబోతున్నట్లుగా ప్రకటించింది.

Reported by: Chandram | సైన్స్​ – టెక్నాలజీ | Apr 04, 2026, 10:45 pm IST
Read Time: 5 mins
VIVO T5 Pro | 9020mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వివో స్మార్ట్‌ఫోన్.. మిడ్ రేంజ్ మొబైల్స్‌లో సంచలనం!

VIVO T5 Pro | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో త్వరలోనే మరో శక్తివంతమైన మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది. Vivo T5 Pro 5జీ మొబైల్‌ను తీసుకురాబోతున్నట్లుగా ప్రకటించింది. దీని కచ్చితమైన లాంచ్ తేదీని ప్రకటించకపోయినప్పటికీ.. మొబైల్ డిజైన్, ఫీచర్లపై కీలక వివరాలను వివో కంపెనీ టీజ్ చేసింది. 9020mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇది గత ఏడాది విడుదలైన Vivo T4 Proకి అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌గా వస్తుందని పేర్కొంది.

శక్తివంతమైన బ్యాటరీ.. అయినా స్లిమ్ డిజైన్!

Vivo T5 Pro 5జీ మొబైల్ 9020mAh శక్తివంతమైన బ్యాటరీతో వస్తున్నట్లు వివో అధికారికంగా వెల్లడించింది. అయితే ఇది గత మోడల్‌లో ఉన్న 6500 mAh బ్యాటరీతో పోలిస్తే గణనీయమైన అప్‌గ్రేడ్‌గా చెప్పవచ్చు. పైగా ఇది 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో కొనసాగనుంది. అంతేకాకుండా ఇంత పెద్ద బ్యాటరీతో వస్తున్నప్పటికీ.. ప్రపంచంలోనే అత్యంత సన్నటి స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుందని కంపెనీ పేర్కొంది.

ఆకట్టుకునే డిజైన్

డిజైన్ పరంగా వివో టీ5 ప్రో ప్రత్యేకంగా కనిపించనుంది. దీని వెనుక భాగంలో రౌండెడ్ ఎడ్జ్‌లతో ఉన్న పిల్ ఆకారపు మాడ్యుల్‌లో అమర్చిన డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2మెగాపిక్సెల్ సెన్సర్ ఉండనుంది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో కూడా 50మెగాపిక్సెల్ కెమెరా ఉంచినట్లు సమాచారం. కెమెరాలకు తోడు ఎల్‌ఈడీ ఫ్లాష్, మరో సర్క్యులర్ ఎలిమెంట్ కూడా ఉండనుది. ఇక పవర్ బటన్, వాల్యూమ్ బటన్లు మొబైల్‌కు ఎడమ వైపు ఉంటాయి. కుడి వైపు ఖాళీగా ఉంటుంది. దిగువ భాగంలో స్పీకర్ గ్రిల్, యూఎస్‌బీ టైప్ సి పోర్టు, సిమ్‌ ట్రేలను అమర్చారు.

డిస్‌ప్లే – పనితీరు

డిస్‌ప్లే విషయానికి వస్తే ఇది 1.5K AMOLED డిస్‌ప్లేతో పాటు 144hz రీఫ్రెష్ రేటుతో వస్తుంది. ఇది గత మోడల్‌లో ఉన్న FHD+ AMOLED, 120hz డిస్‌ప్లేతో పోలిస్తే మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది.

ఇక పనితీరు విషయానికి వస్తే.. ఇది Qualcomm తయారుచేసిన Snapdragon 7s Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS6పై పనిచేయనుంది. అలాగే IP68+, IP69+ రేటింగ్‌తో దుమ్ము, నీటి నిరోధకతను అందించనుంది

ధర ఎంత ఉండచ్చంటే..

ఈ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో లాంచ్ కానుంది. దీని ధర భారత్‌లో రూ.30 వేల నుంచి 35 వేల మధ్యలో ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్‌తో వస్తున్న బేస్ వేరియంట్ ధర సుమారు రూ.29,999గా ఉండొచ్చని అంచనా. నివేదికల ప్రకారం ఈ ఫోన్ ఏప్రిల్ మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Read More:

భారీ డిస్కౌంట్ ఆఫర్లతో సెల్ఫీ మిర్రర్ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..!

డ్యూయల్ 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ స్మార్ట్‌ఫోన్.. లీకైన స్పెసిఫికేషన్లు!