Realme 16 5G | భారీ డిస్కౌంట్ ఆఫర్లతో సెల్ఫీ మిర్రర్ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..!

Realme 16 5G | సెల్ఫీ మిర్రర్ ఫీచర్‌తో రియల్‌మీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 7000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో పాటు 60W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టును ఇచ్చింది. దీంతో ఈ ఫోన్‌పై యూత్‌లో ఆసక్తి పెరుగుతుంది.

Realme 16 5G | భారీ డిస్కౌంట్ ఆఫర్లతో సెల్ఫీ మిర్రర్ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..!

Realme 16 5G | సెల్ఫీ మిర్రర్ ఫీచర్‌తో రియల్‌మీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. . కంటెంట్ క్రియేటర్స్, సోషల్‌మీడియాను ఎక్కువగా వినియోగించే వారే టార్గెట్‌ను ఈ మొబైల్‌లో భారత్‌లో విడుదల చేసింది. పైగా 7000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో పాటు 60W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టును ఇచ్చింది. దీంతో ఈ ఫోన్‌పై యూత్‌లో ఆసక్తి పెరుగుతుంది.

ఇండియాలోనే ఫస్ట్ ఫోన్!

భారత్‌లో Selfie Mirror ఫీచర్‌తో వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదేనని రియల్‌మీ కంపెనీ తెలిపింది. ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ ఫోన్ వెనుకభాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఆటో ఫోకస్, f/1.8 అపర్చర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, అలాగే, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ వెనుక కెమెరా మాడ్యుల్‌లో చిన్న వృత్తాకార అద్ధం ఉంది. దీన్నే సెల్ఫీ మిర్రర్ అని పిలుస్తారు. దీని సాయంతో వెనుక కెమెరాతోనే సెల్ఫీలు తీసుకోవచ్చు. ఇది సోషల్‌మీడియా వినియోగదారులకు, కంటెంట్ క్రియేటర్లకు ఉపయోగపడుతుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో కూడా 50మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

ధర ఎంత అంటే..

ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 8జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999గా ఉంది. 8జీబీ+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గా ఉంది. 12జీబీ+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999గా ఉంది. ఇక ఈ ఫోన్‌ ఎయిర్ బ్లాక్, ఎయిర్ వైట్ కలర్ ఆప్షన్లతో వస్తుంది.

డిస్కౌంట్ – ఆఫర్లు

ఈ మొబైల్ భారత్‌లోకి అందుబాటులోకి వచ్చినప్పటికీ సేల్స్ మాత్రం ఏప్రిల్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ప్రీ ఆర్డర్ అందుబాటులో ఉంది. ఆసక్తిగల కస్టమర్లు రియల్‌మీ లేదా ఫ్లిప్‌కార్ట్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ మొబైల్స్‌పై 12 నెలల వరకు No Cost EMI సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అలాగే రూ.2 వేల వరకు అదనపు డిస్కౌంట్, రూ.5వేల వరకు అదనపు ఎక్సేంజ్ బోనస్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా రూ. వెయ్యి లాయల్టీ బోనస్ ఆఫర్ కూడా ఉంది.

పవర్‌ఫుల్ బ్యాటరీ మరో మెయిన్ హైలైట్

ఈ స్మార్ట్‌ఫోన్‌లో మరో ప్రధాన ఆకర్షణ.. దీని బ్యాటరీ. ఈ మొబైల్‌ 7000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వస్తుంది. కంపెనీ లెక్కల ప్రకారం 1600 ఫుల్ చార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా బ్యాటరీ హెల్త్ 80 శాతం వరకు ఉంటుంది. ఇది 60W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్టు చేసింది. అంటే కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ అవుతుంది. 74 నిమిషాల్లో మొత్తం చార్జ్ అవుతుంది. ఇది బైపాస్ చార్జింగ్‌, రివర్స్ చార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే గరిష్టంగా 142 గంటల పాటు మ్యూజిక్ ప్లే బ్యాక్ సమయాన్ని అందిస్తుంది.

పెద్ద బ్యాటరీ అయినా స్లిమ్ డిజైన్

ఇక భారీ బ్యాటరీతో వస్తున్నప్పటికీ ఫోన్ చాలా సన్నగా ఉండటం విశేషం. ఈ ఫోన్ కేవలం 8.1 మిల్లీమీటర్ల మందం, 183 గ్రాముల బరువుతో స్లిమ్ డిజైన్‌లో వస్తుంది. AirCraft Structure టెక్నాలజీని వాడటం వల్ల భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ స్లిమ్ డిజైన్ ఇవ్వడం సాధ్యమైంది.

డిస్‌ప్లే

డిస్‌ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ 6.57 అంగుళాల FHD+AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 93 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో పాటు 120Hz రీఫ్రెష్ రేట్, 4200 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. దీని స్క్రీన్ చాలా ప్రకాశవంతంగా, సున్నితంగా ఉంటుంది.

ఇతర స్పెసిఫికేషన్లు

పర్ఫార్మెన్స్‌పరంగా ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0తో ఈ ఫోన్ పనిచేస్తుంది. అలాగే IP69 రేటింగ్‌తో వస్తుండటంతో ధూళి, నీటి నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది. అలాగే వేడిమి నియంత్రణ కోసం AirFlow వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌‌ను కూడా ఇందులో అందించారు.

Read More:

Vivo V70 FE | మార్కెట్‌లోకి వచ్చేసిన 200MP కెమెరా ఫోన్.. 60 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్.. ధర ఎంతంటే..!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్.. బడ్జెట్ ధరలో రెడ్‌మీ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్!