Vivo V70 FE | మార్కెట్‌లోకి వచ్చేసిన 200MP కెమెరా ఫోన్.. 60 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్.. ధర ఎంతంటే..!

Vivo V70 FE | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ Vivo V70 FEని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. 200మెగాపిక్సెల్ కెమెరా, 7000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో పాటు ఆకట్టుకునే ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Vivo V70 FE | మార్కెట్‌లోకి వచ్చేసిన 200MP కెమెరా ఫోన్.. 60 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్.. ధర ఎంతంటే..!

Vivo V70 FE | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ Vivo V70 FEని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. 200మెగాపిక్సెల్ కెమెరా, 7000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో పాటు ఆకట్టుకునే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌ సెట్‌ కలిగి ఉండి.. ఏఐ ఇమేజింగ్ ఫీచర్లను అందిస్తుంది. అలాగే ఆరు సంవత్సరాల భద్రతా అప్‌డేట్లను అందిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ సేల్స్ ఏప్రిల్ 9వ తేదీన మొదలుకానున్నాయి. అయితే ప్రస్తుతానికి ప్రీ అర్డర్లు ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల కస్టమర్లు వివో కంపెనీతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజి, 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజి వేరియంట్ ధర రూ.37,999గా నిర్ణయించారు. 8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజి వేరియంట్ ధర రూ.40,999గా ఉంది. 12జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజి వేరియంట్ ధర రూ.44,999గా ఉన్నాయి. ఇక ప్రారంభ ఆఫర్ కింద ఈ మొబైల్ కొనుగోలు చేసే కస్టమర్లకు ANC సదుపాయం కలిగిన vivo TWS 3e ఇయర్‌బడ్స్‌ను రూ.1,499కే అందిస్తోంది.

కెమెరానే హైలైట్

Vivo V70 FE మోడల్‌లో కెమెరానే ప్రత్యేక హైలెట్‌గా చెప్పవచ్చు. ఈ ఫోన్ వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతుతో కూడిన 200 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంది. అలాగే ఆరా లైట్ మద్దతు కలిగిన 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఇందులో ఏర్పాటుచేశారు. సెల్ఫీలు, వీడియోల కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. ఈ ఫోన్‌లో అద్భుతమైన ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఏఐ మ్యాజిక్ వెదర్, ఏఐ మ్యాజిక్ ల్యాండ్‌స్కేప్, ఏఐ ఫోర్ సీజన్ పోర్ట్రయిట్ వంటి ఫీచర్లతో పాటు ఏఐ ఆధారిత 30x సూపర్ జూమ్ కూడా కలిగి ఉంది. ఇక గేమింగ్ హైపర్ సెన్స్ ఆడియోతో కూడిన సిమెట్రికల్ డ్యూయల్ స్పీకర్లు కూడా ఇచ్చారు.

పవర్‌ఫుల్ బ్యాటరీ.. 90W ఫాస్ట్ చార్జింగ్

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరాతో పాటు బ్యాటరీ కూడా అద్భుతంగా ఉంది. ఇందులో 7000mAh భారీ బ్యాటరీని అందించింది. దీనికి తోడు 90W ఫాస్ట్ చార్జింగ్ మద్దతు కూడా లభిస్తుంది. దీనివల్ల కేవలం 60 నిమిషాల్లో ఒక శాతం నుంచి 100 శాతం వరకు చార్జి అవుతుందని వివో కంపెనీ తెలిపింది. ఇందులో బైపాస్ చార్జింగ్ ఫీచర్‌ కూడా ఉంది. దీనివల్ల గేమింగ్ సమయంలో మొబైల్ వేడెక్కకుండా చల్లగా ఉంచడంలో ఈ ఫీచర్ సహాయపడుతుంది. దీనివల్ల బ్యాటరీ బ్యాకప్ ఎక్కువకాలం వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యమైన స్పెసిఫికేషన్లు

* ఈ మొబైల్ 6.83 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేతో 120Hz రీఫ్రెష్ రేటు అందిస్తుంది. అలాగే 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 449 ppi పిక్సెల్ డెన్సిటీని అందిస్తుంది. HDR10+ సపోర్టు చేస్తుంది. దీనివల్ల వీడియోలు చూసినప్పుడు, గేమ్స్ ఆడినప్పుడు లేదా బ్రౌజింగ్ చేసినప్పుడు మెరుగైన అనుభవాన్ని యూజర్లు పొందవచ్చు.

* ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌సెట్‌ను ప్రాసెసర్ అమర్చారు. దీనివల్ల మల్టీ టాస్కింగ్‌తోపాటు గేమింగ్ సమయంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

* ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS6పై పనిచేస్తుంది. దీనికి ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను వివో కంపెనీ అందిస్తుంది.

*IP 68, IP 69 రేటింగ్‌తో కూడిన వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.

కలర్ ఆప్షన్స్

ఈ ఫోన్ మాన్‌సూన్ బ్లూ, నార్తర్న్ లైట్స్ పర్‌పుల్ అనే రెండు రంగుల్లో వస్తుంది. అలాగే మాన్‌సూన్ బ్లూ కలర్ వేరియంట్ మొబైల్ ఒక ప్రత్యేకమైన డార్క్‌నెస్ గ్లో టెక్నాలజీతో వస్తుంది. అంటే తక్కువ కాంతిలో ఒకలా, సూర్యరశ్మి తగిలినప్పుడు మరోలా ఈ మొబైల్ మెరుస్తుంది. దీనివల్ల మొబైల్ కొత్తగా కనిపిస్తుంది.

Read More:

ఫోల్డబుల్ ఐఫోన్ 2026: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో యాపిల్ భారీ సంచలనం

డ్యూయల్ 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ స్మార్ట్‌ఫోన్.. లీకైన స్పెసిఫికేషన్లు!