Redmi 15A | ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్.. బడ్జెట్ ధరలో రెడ్‌మీ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్!
Redmi 15A | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ(Xiaomi) తన సబ్ బ్రాండ్ రెడ్‌మీ (Redmi) నుంచి బడ్జెట్ ధరలో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. A సిరీస్‌లో Redmi 15A మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది.
Redmi 15A | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ(Xiaomi) తన సబ్ బ్రాండ్ రెడ్‌మీ (Redmi) నుంచి బడ్జెట్ ధరలో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. A సిరీస్‌లో Redmi 15A మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. తక్కువ ధరలోనే భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే, ఏఐ ఫీచర్లతో మిడిల్ క్లాస్ కస్టమర్లను ఆకట్టుకునేలా దీన్ని రూపొందించింది.
తక్కువ ధరలోనే మూడు వేరియంట్లు
Redmi 15A స్మార్ట్‌ఫోన్ ముఖ్యంగా మూడు వేరియంట్లలో వస్తుంది. 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.12,999గా నిర్ణయించారు. ఇక 4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ ధరను రూ.14,499గా ఖరారు చేశారు. అలాగే 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.16,499కి లభిస్తుంది.
కలర్ ఆప్షన్స్ – సేల్ వివరాలు
కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. మూడు ఆకర్షణీయమైన రంగుల్లో వస్తుంది. Ace Black, Awesome Blue, Amaze Purple వంటి రంగుల్లో Redmi 15A మొబైల్ అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, Mi వెబ్‌సైట్స్‌తో పాటు షావోమీ రిటైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
ఫీచర్లు – స్పెసిఫికేషన్లు
ఫీచర్ల విషయానికి వస్తే Redmi 15A మొబైల్‌లో 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. 60Hz, 90Hz, 120Hz రీఫ్రెష్ రేట్లను ఈ స్మార్ట్‌ఫోన్ సపోర్టు చేయడం విశేషం. ఇది 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS3పై పనిచేస్తుంది. ముఖ్యంగా నాలుగేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని షావోమీ కంపెనీ తెలిపింది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. Redmi 15A మొబైల్‌లో Unisoc T8300 5జీ ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6nm టెక్నాలజీపై తయారైన చిప్‌సెట్‌తో పాటు Mali-G57 GPUతో వస్తుంది. గరిష్ఠంగా 128జీబీ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్లలో మైక్రోSD కార్డు ద్వారా 2TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు. అదనంగద గూగుల్ జెమినీ, సర్కిల్ టు సెర్చ్ వంటి ఏఐ ఫీచర్లును కూడా ఇందులో పొందుపరిచారు.
కెమెరా
ఫొటోగ్రఫీ కోసం Redmi 15A స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 32 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
బ్యాటరీ కెపాసిటీ
తక్కువ ధరలో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీనే ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. 6300mAh భారీ బ్యాటరీ ఈ మొబైల్‌లో ఉంది. ఇది 15W వైర్డ్ చార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. అలాగే 7.5W రివర్స్ చార్జింగ్ సౌకర్యం కూడా కలదు. ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెప్పింది. అదనంగా IP52 రేటింగ్, స్టీరియో స్పీకర్లు, 5జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తంగా బడ్జెట్ ధరలో పెద్ద డిస్‌ప్లే, దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్ కోరుకునే కస్టమర్లను ఇది విశేషంగా ఆకట్టుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Read More:
గూగుల్ పిక్సెల్ కెమెరా డిజైన్‌తో టెక్నో స్పార్క్ 50.. రూ.17 వేలకే!!
సమ్మర్‌లో మీ మొబైల్ ఫోన్ త్వరగా హీటెక్కుతుందా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
సెల్ఫీ మిర్రర్‌తో భారత్‌లో తొలి ఫోన్.. 7000mAh భారీ బ్యాటరీతో రియల్‌మీ సర్‌ప్రైజ్!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram