Realme 16 5G | సెల్ఫీ మిర్రర్‌తో భారత్‌లో తొలి ఫోన్.. 7000mAh భారీ బ్యాటరీతో రియల్‌మీ సర్‌ప్రైజ్!
Realme 16 5G | సెల్ఫీ మిర్రర్ ఫీచర్‌తో Realme 16 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్‌లో లాంచ్ చేయబోతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 7000mAh పవర్‌ఫుల్ బ్యాటరీని కూడా జోడించడంతో దీనిపై యూత్‌లో ఆసక్తి పెరిగిపోతుంది.
Realme 16 5G | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త సంచలనం సృష్టించేందుకు రియల్‌మీ సిద్ధమైంది. కంటెంట్ క్రియేటర్స్, సోషల్‌మీడియాను ఎక్కువగా వినియోగించే వారిపై ఫోకస్ చేసి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తుంది. సెల్ఫీ మిర్రర్ ఫీచర్‌తో Realme 16 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్‌లో లాంచ్ చేయబోతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 7000mAh పవర్‌ఫుల్ బ్యాటరీని కూడా జోడించడంతో దీనిపై యూత్‌లో ఆసక్తి పెరిగిపోతుంది.
ఇండియాలోనే ఫస్ట్ ఫోన్!
ఇప్పటికే వియత్నాంలో Realme 16 5జీ మొబైల్ విడుదలైంది. త్వరలోనే దీన్ని ఇండియాలో కూడా విడుదల చేయనుంది. భారతదేశంలో తొలిసారిగా Selfie Mirror ఫీచర్‌తో ఫోన్ తీసుకొస్తున్నట్లుగా రియల్‌మీ కంపెనీ తెలిపింది. ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ రియర్ కెమెరా మాడ్యుల్‌లో చిన్న వృత్తాకార అద్దం ఉంటుంది. దీనివల్ల వెనుక కెమెరాతోనే సెల్ఫీలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా సోషల్‌మీడియా వినియోగదారులకు, కంటెంట్ క్రియేటర్లకు చాలా ఉపయోగకరంగా మారే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కెమెరా స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ సోనీ IMX852 మెయిన్ కెమెరా, 2మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఉండొచ్చని సమాచారం. అలాగే ముందు భాగంలో కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా వచ్చే అవకాశం ఉంది.
పవర్‌ఫుల్ బ్యాటరీ మరో మెయిన్ హైలైట్
ఈ స్మార్ట్‌ఫోన్‌లో మరో ప్రధాన ఆకర్షణ.. దీని బ్యాటరీ. ఈ మొబైల్ 7000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వస్తుంది. దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే ఎక్కువసేపు వినియోగించుకోవచ్చు. కంపెనీ లెక్కల ప్రకారం..
* వాట్సాప్‌లో సుమారు 21.67 గంటలు చాట్ చేయవచ్చు.
* ఇన్‌స్టాగ్రామ్‌లో 22.86 గంటల పాటు రీల్స్ చూడవచ్చు.
* యూట్యూబ్‌లో 22 గంటల పాటు నాన్‌స్టాప్‌గా వీడియోలు చూడవచ్చు.
* కేవలం మ్యూజిక్ మాత్రమే అయితే 6 రోజుల వరకు వినవచ్చు.
పెద్ద బ్యాటరీ అయినా స్లిమ్ డిజైన్
ఇదే కాకుండా, ఈ ఫోన్ 60W ఫాస్ట్ చార్జింగ్, ఏఐ స్మార్ట్ చార్జింగ్, ఏఐ స్మార్ట్ పవర్ సేవింగ్ మోడ్స్‌లో కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ బ్యాటరీని 1600 చార్జ్ సైకిల్స్ లేదా దాదాపు ఆరేళ్ల వరకు పనితీరును కొనసాగిస్తుందని రియల్‌మీ కంపెనీ తెలిపింది. ఇక భారీ బ్యాటరీతో వస్తున్నప్పటికీ ఫోన్ చాలా సన్నగా ఉండటం విశేషం. ఈ ఫోన్ కేవలం 8.1 మిల్లీమీటర్ల మందం, 183 గ్రాముల బరువుతో స్లిమ్ డిజైన్‌లో వస్తుంది. AirCraft Structure టెక్నాలజీని వాడటం వల్ల భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ స్లిమ్ డిజైన్ ఇవ్వడం సాధ్యమైంది.
కలర్ ఆప్షన్స్
ఈ ఫోన్ ఎయిర్ బ్లాక్, ఎయిర్ వైట్ కలర్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. అదనంగా ఇందులో గ్లేమింగ్ వింగ్స్ ఫినిష్‌ను అందిస్తున్నారు. అంటే లైట్ పడినప్పుడు బ్లూ గోల్డ్ కలర్ ఎఫెక్ట్ ఇచ్చేలా ప్రత్యేక డిజైన్‌తో రూపొందించారు. అలాగే యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్, స్కిన్ ఫ్రెండ్లీ బ్యాక్ ప్యానెల్‌ను కూడా అందించారు.
డిస్‌ప్లే
డిస్‌ప్లే విషయానికి వస్తే Realme 16 5G స్మార్ట్‌ఫోన్ 6.57 అంగుళాల FHD+AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 4200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. దీని స్క్రీన్ చాలా ప్రకాశవంతంగా, సున్నితంగా ఉంటుంది. దీన్ని బయట ఉపయోగించినప్పుడు కూడా అద్భుతమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.
ఇతర స్పెసిఫికేషన్లు
పర్ఫార్మెన్స్‌పరంగా ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో చిప్‌సెట్ ఉండొచ్చని అంచనా. గతంలో వచ్చిన Realme 15లో ఉన్న డైమెన్సిటీ 7300 ప్లస్ పోలిస్తే తక్కువే అయినప్పటికీ.. ఈ ఫోన్ విడుదలైన తర్వాతే అసలు వ్యత్యాసం తెలియనుంది. ఇక ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0తో పనిచేస్తుంది. భద్రతాపరంగా ఈ ఫోన్‌కు IP69 రేటింగ్ ఇచ్చారు. అంటే ధూళి, నీటి నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది. అలాగే వేడిమి నియంత్రణ కోసం AirFlow వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందించారు.
అయితే పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు మాత్రం ఇంకా అధికారికంగా వెలువడలేదు. వాటి ప్రకటన తర్వాతే ఈ ఫోన్ ఎలాంటి కాంపిటీషన్ ఇవ్వనుందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే కెమెరా, బ్యాటరీ పనితీరుకు అధిక ప్రాధాన్యత ఇచ్చే వారికి ఈ ఫోన్‌ను మంచి ఎంపికగా మారవచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read More:
9000mAh పవర్‌ఫుల్ బ్యాటరీ.. గేమింగ్ యూజర్లే టార్గెట్‌గా కొత్త 5జీ ఫోన్!
వివో నుంచి త్వరలోనే రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లు, ధర వివరాలు లీక్!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram