• Telugu News
  • /Science technology

Vivo | వివో నుంచి త్వరలోనే రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లు, ధర వివరాలు లీక్!

Vivo | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో భారత మార్కెట్‌లోకి మరిన్ని మొబైళ్లను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. Y సిరీస్ నుంచి రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Reported by: Chandram | సైన్స్​ – టెక్నాలజీ | Mar 21, 2026, 11:36 pm IST
Read Time: 5 mins
Vivo | వివో నుంచి త్వరలోనే రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లు, ధర వివరాలు లీక్!

Vivo | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో భారత మార్కెట్‌లోకి మరిన్ని మొబైళ్లను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. Y సిరీస్ నుంచి రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే Vivo Y21, Vivo Y11 స్మార్ట్‌ఫోన్లు గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే ఈ రెండూ భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

రెండు ప్రత్యేక కలర్లలో..!

ఇప్పటికే Y11, Y21 రెండు 5జీ స్మార్ట్‌ఫోన్ల మోడళ్ల ధరలు, ఫీచర్లు లీకయ్యాయి. ఇవి కాస్త కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. లీకైన వివరాల ప్రకారం.. Vivo Y21 5జీ షాంపైన్ గోల్డ్, మిడ్‌నైట్ బ్లూ రంగుల్లో వస్తుంది. ఇక Vivo Y1 5జీ స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, సన్‌షైన్ గోల్డ్ రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ వివరాలను వివో కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

స్పెసిఫికేషన్లు

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ రెండు ఫోన్లలో కూడా శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఇవ్వనున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. అలాగే 120Hz రీఫ్రెష్ రేట్‌, 1200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో, 6.74 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉండొచ్చని అంచనా. అదనంగా IP65 రేటింగ్‌తో దుమ్ము, నీటి నిరోధకత కూడా ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS6పై పనిచేయనున్నట్లు తెలుస్తోంది.

6500mAh భారీ బ్యాటరీ

ఈ రెండు మొబైళ్లు కూడా 6500 mAh భారీ బ్యాటరీతో వస్తున్నాయి. అయితే Y21 5జీ మోడల్ 44W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తుంది. Y11 5జీ స్మార్ట్‌ఫోన్ 15W చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

కెమెరా

కెమెరాల పరంగా Y21 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉండగా.. Y11 5జీ మొబైల్‌లో 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా వచ్చే అవకాశం ఉంది. ఇక రెండు ఫోన్లలోనూ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండొచ్చు.

ధర వివరాలు..!

Vivo Y21 5జీ బేస్ వేరియంట్ (4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్) మొబైల్ ధర రూ.18,499గా ఉండొచ్చని తెలుస్తోంది. అదే 6 జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,499; 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,499గా ఉండే అవకాశం ఉంది. ఇక Vivo Y11 5జీ బేస్ వేరియంట్ (4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్) మొబైల్ ధర రూ.14,999గా ఉండొచ్చని తెలుస్తోంది. అదే 4 జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉండొచ్చని సమాచారం. మొత్తం మీద బడ్జెట్‌ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ల కోసం చూస్తున్న వారికి ఈ రెండు మోడళ్లు మంచి ఎంపికగా మారే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read More :

13 వేలకే 7000mAh భారీ బ్యాటరీ మొబైల్.. రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఫుల్ డీటైల్స్!

సగం ధరకే Galaxy S26 Ultra, Galaxy S26+.. బంపర్ స్కీమ్ తీసుకొచ్చిన శాంసంగ్!