Realme P4 Lite 5G | 13 వేలకే 7000mAh భారీ బ్యాటరీ మొబైల్.. రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఫుల్ డీటైల్స్!

Realme P4 Lite 5G | భారీ బ్యాటరీతో బడ్జెట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ కావాలని చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ 7000mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో రియల్‌మీ పీ4 లైట్ 5జీ మొబైల్‌ను తీసుకొచ్చింది.

Reported by: Chandram | సైన్స్​ – టెక్నాలజీ | Mar 19, 2026, 10:23 pm IST
Read Time: 4 mins
Realme P4 Lite 5G | 13 వేలకే 7000mAh భారీ బ్యాటరీ మొబైల్.. రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఫుల్ డీటైల్స్!

Realme P4 Lite 5G | చవకైన ధరలో భారీ బ్యాటరీ మొబైల్ కోసం చూస్తున్నారా! బడ్జెట్ మొబైల్ కావాలని అనుకునే వారి కోసం ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ భారత మార్కెట్‌లోకి కొత్త 5G మొబైల్‌ను తీసుకొచ్చింది. 7000mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో పాటు కూలింగ్ చాంబర్‌తో Realme P4 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.

ఈ మొబైల్‌ను ఇటీవల వచ్చిన Realme C83 మోడల్‌కు రీ‌బ్రాండ్ వెర్షన్‌లా తెలుస్తోంది. ఈ రెండింటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. కాకపోతే డిజైన్‌లో మాత్రం స్వల్ప వ్యత్యాసం ఉంది. Realme P4 Lite మొసాయి లుక్‌తో వచ్చింది.

స్పెసిఫికేషన్లు

* 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
* 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్‌పీక్ బ్రైట్‌నెస్
* IP64 రేటింగ్‌తో డస్ట్, స్ప్లాష్ రెసిస్టెంట్
* మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 ఓఎస్‌తో పనిచేస్తుంది.

కెమెరా

ఈ మొబైల్‌కు వెనుక వైపు డ్యుయెల్ కెమెరా సెటప్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన కెమెరా 13 మెగా పిక్సెల్‌తో వస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. ఈ మొబైల్ మొజాయిక్ గ్రీన్, మొజాయిక్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

బ్యాటరీనే హైలెట్!

ఈ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీనే ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు. ఈ మొబైల్ 7000mAh భారీ బ్యాటరీతో వస్తుంది. అలాగే 15W చార్జింగ్, బైపాస్ చార్జింగ్, రివర్స్ OTG చార్జింగ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ధర ఎంతంటే..

Realme P4 Lite 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. 4జీబీ+64జీబీ ధరను రూ.12,999గా నిర్ణయించారు. 4జీబీ+128జీబీ ధరను రూ.13,999గా; 6జీబీ+128జీబీ ధరను 15,999గా నిర్ణయించారు. ఈ మొబైల్ సేల్స్ మార్చి 25వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్నాయి. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్లలో అమ్మకాలు మొదలవుతాయి. ప్రారంభ సేల్ ఆఫర్లలో భాగంగా రూ.1500 వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుందని రియల్‌మీ కంపెనీ తెలిపింది. తొలి సేల్‌లో భాగంగా రూ.1000 డిస్కౌంట్‌తో పాటు బ్యాంకు కార్డులపై మరో 500 తగ్గింపు లభిస్తుందని వివరించింది.

Read More :

వన్‌ప్లస్ యూజర్లకు షాక్.. Nord 6 ధరలో భారీగా పెంపు!

15వేల లోపే బెస్ట్ స్మార్ట్‌ఫోన్.. భారీ బ్యాటరీ, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ !