SmartPhone Overheating | సమ్మర్‌లో మీ మొబైల్ ఫోన్ త్వరగా హీటెక్కుతుందా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

SmartPhone Overheating | సమ్మర్‌లో స్మార్ట్‌ఫోన్లు తొందరగా వేడెక్కుతుంటాయి. అలాంటి సమయంలోనూ ఫోన్ వాడినప్పుడు ఓవర్‌హీటైపోతుంది. తద్వారా బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది. ఒక్కోసారి మొబైల్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే వేసవికాలంలో ఫోన్ హీటవ్వకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించడం బెటర్!

Reported by: Chandram | సైన్స్​ – టెక్నాలజీ | Mar 26, 2026, 3:29 pm IST
Read Time: 6 mins
SmartPhone Overheating | సమ్మర్‌లో మీ మొబైల్ ఫోన్ త్వరగా హీటెక్కుతుందా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

SmartPhone Overheating | సమ్మర్‌లో ఎండ వేడికి మనుషులే కాదు.. మనం వాడే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కూడా హీటెక్కిపోతాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు అయితే తొందరగా వేడెక్కిపోతాయి. నిమిషాల్లో ఓవర్‌హీట్ అయిపోయి మొబైల్ యూజ్ చేయడానికి కూడా అవ్వదు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే తరచూ హీటవ్వడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది.. ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మరీ ఈ సమస్య నుంచి ఎలా బయటపేందుకు టెక్ నిపుణులు చెబుతున్న కొన్ని చిట్కాలను ఫాలో అవ్వడం బెటర్!

ఫోన్ ఎందుకు వేడెక్కుతుంది?

ఎండలో ఫోన్ వాడినప్పుడు సూర్యరశ్మి నేరుగా తగిలి బయట నుంచి వేడెక్కుతుంది. పైగా ఎక్కువసేపు వీడియోలు చూడటం, గేమ్స్ వాడటం వల్ల బ్యాటరీ కూడా తొందరగా హీటవుతుంది. అలా అధిక ఉష్ణోగ్రత వల్ల బ్యాటరీ, క్రమక్రమంగా మదర్‌బోర్డు సర్క్యూట్ బోర్డు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

అలా ఫోన్ వేడి అయినప్పుడు ఫోన్‌ను వాడటం మానేయాలి. అలా కాకుండా అలాగే వాడితే..
* బ్యాటరీ త్వరగా తగ్గిపోవడం
* టచ్ సెన్సార్ సమస్యలు
* ఫోన్ స్లో అవ్వడం వంటి సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో బ్యాటరీ ఉబ్బిపోతుంది.

ఫోన్ హీటైనప్పుడు ఏం చేయాలి?

* ముందుగా ఫోన్ వాడటం వెంటనే ఆపేయాలి
* మొబైల్‌ను చల్లటి ప్రదేశంలో ఉంచాలి
* బ్యాగ్‌లో లేదా నీడలో కొంతసేపు పెట్టాలి.
* బ్యాక్ కవర్ తీసేయాలి.

ఓవర్ హీటవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

* నేరుగా సూర్యరశ్మి తగిలేలా ఫోన్‌ను వాడకూడదు. చాలామంది కార్లలో వెళ్లేటప్పుడు డ్యాష్‌బోర్డులపై లేదా ఇంటి దగ్గర కిటికీ దగ్గర ఫోన్ పెడతారు. ఇలాంటి సమయంలో ఫోన్‌కు డైరెక్ట్‌గా సూర్యరశ్మి తగిలి బయట నుంచి త్వరగా వేడవుతుంది. అందుకే ఫోన్‌ను సాధ్యమైనంత వరకు గాలి ఆడే చోట, నీడలో ఉంచాలి.
* కొంతమంది గంటలు గంటలు గేమ్స్, సోషల్‌‌మీడియాలోనే గడిపేస్తుంటారు. ఈ సమ్మర్‌లో అసలే బయట వేడి ఉంటుంది.. పైగా ఫోన్‌ యూసేజ్ కూడా పెంచినప్పుడు తొందరగా వేడవుతుంది. కాబట్టి సోషల్‌మీడియా, గేమ్స్‌ను పరిమితం చేయాలి.
* ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు సహజంగానే కొంత వేడి విడుదలవుతుంది. పైగా వేసవిలో బయట ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా వేడవుతుంది. కాబట్టి చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ వాడకూడదు. అలాగే బ్యాక్ కవర్ కూడా తీసేయడం మంచిది.
* చాలామందికి ఖాళీగా ఉంటే ఫోన్ చార్జింగ్ పెట్టి వదిలేస్తారు. కానీ సమ్మర్‌లో అలా ఎప్పుడూ చార్జింగ్ పెట్టి ఉంచడం మంచిది కాదు. అవసరమైనప్పుడు, బ్యాటరీ తగ్గినప్పుడు మాత్రమే చార్జింగ్ పెట్టాలి. 80 శాతం కంటే ఎక్కువ చార్జింగ్ కాగానే తీసేయాలి.
* ఫోన్‌ను స్టోరేజినీ వీలైనంత వరకు ఖాళీగా ఉంచుకోవాలి. అనవసరమైన యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లు అవసరం లేనప్పుడు కూడా ఆన్ చేయడం వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రాసెసర్ నిరంతరం పనిచేస్తుంది. తద్వారా ఫోన్ హీటెక్కుతుంది.

Read More:

శాంసంగ్ ఫోన్ కంటే తక్కువ ధరలో రాయల్ ఎన్‌ఫీల్డ్.. యూత్ నుంచి యమ క్రేజ్!

శాంసంగ్‌ ఫోన్లలో యాపిల్ Airdrop!.. ఇక ఆండ్రాయిడ్ మొబైళ్ల నుంచి ఐఫోన్లకు షేరింగ్ మరింత ఈజీ!

9000mAh పవర్‌ఫుల్ బ్యాటరీ.. గేమింగ్ యూజర్లే టార్గెట్‌గా కొత్త 5జీ ఫోన్!