Royal Enfield Hunter 350 | శాంసంగ్ ఫోన్ కంటే తక్కువ ధరలో రాయల్ ఎన్‌ఫీల్డ్.. యూత్ నుంచి యమ క్రేజ్!

Royal Enfield Hunter 350 | భారత టూవీలర్ మార్కెట్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్‌పై రోజురోజుకీ క్రేజ్ పెరిగిపోతుంది. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా మోడల్ ఫోన్ కంటే కూడా సరసమైన ధరలో వస్తుండటంతో యూత్ ఎక్కువగా ఈ మోడల్‌వైపు మొగ్గుచూపుతున్నారు.

Reported by: Chandram | Latest News | Mar 25, 2026, 11:27 pm IST
Read Time: 5 mins
Royal Enfield Hunter 350 | శాంసంగ్ ఫోన్ కంటే తక్కువ ధరలో రాయల్ ఎన్‌ఫీల్డ్.. యూత్ నుంచి యమ క్రేజ్!

Royal Enfield Hunter 350 | భారత టూవీలర్ మార్కెట్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా యూత్‌లో ఈ బైక్‌పై రోజురోజుకీ క్రేజ్ పెరిగిపోతుంది. దీనికి కారణంగా స్టైల్‌తో పాటు అద్భుతమైన పనితీరు కలిగిన ఈ బైక్ చాలా తక్కువ ధరకు రావడమే.! అది కూడా శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా మోడల్ ఫోన్ కంటే కూడా సరసమైన ధరలో వస్తుండటంతో యువత ఈ బైక్ కొనేందుకు షోరూంలకు క్యూ కడుతున్నారు.

సేల్స్‌లో దూసుకెళ్తున్న హంటర్ 350

2026 ఫిబ్రవరిలో ఒక్క నెలలోనే హంటర్ 350 బైక్‌లు 20,234 అమ్ముడయ్యాయి. గత సంవత్సరం ఫిబ్రవరిలో అమ్ముడైన 16,599 యూనిట్లతో పోలిస్తే గణనీయంగా పెరుగుదల వచ్చింది. అంటే ఏడాదిలోనే 3,635 యూనిట్ల అదనపు అమ్మకాలు నమోదయ్యాయి. శాతంపరంగా చూస్తే 21.9 శాతం వృద్ధి నమోదైంది. దీన్నిబట్టి ఈ బైక్‌కు మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ధరే ప్రధాన ఆకర్షణ

రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ బైకులంటే సాధారణంగా ధర ఎక్కువగానే ఉంటుంది. కానీ హంటర్ 350 మాత్రం వాటికి భిన్నంగా తక్కువ ధరలోనే లభిస్తుంది. ఈ బైక్ ప్రారంభ ధర సుమారు రూ.1.38లక్షలుగా ఉంది. ఆసక్తికర విషయమేంటంటే.. భారత మార్కెట్‌లో లభ్యమవుతున్న Samsung Galaxy S26 Ultra వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ధర కంటే కూడా చాలా తక్కువ. 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.1.40లక్షలుగా ఉంది. కానీ అంతకంటే తక్కువకే హంటర్ 350 బైక్ బేస్ మోడల్ వస్తుండటం విశేషం. దీంతో కొత్తగా బైక్ కొనేవారితో పాటు, అప్‌గ్రేడ్ అవ్వాలని అనుకునేవారు కూడా ఈ మోడల్‌పైనే ఆసక్తి చూపిస్తున్నారు.

వేరియంట్లు

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 వివిధ కలర్లతో పాటు వివిధ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

* బేస్ మోడల్ ధర కేవలం రూ.1.38 లక్షలుగా ఉంది. బ్లాక్ కలర్‌లో వస్తుంది.
* మిడ్ వేరియంట్ టేపర్ గ్రే, గ్రాఫైట్ గ్రే, రియా వైట్ వంటి రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ.1.62 లక్షల వరకు ఉంటుంది.
* టాప్ వేరియంట్‌లు రెబల్ బ్లూ, లండన్ రెడ్, టోక్యో బ్లాక్ వంటి రంగుల్లో దొరుకుతుంది. దీని ధర రూ.1.67 లక్షల వరకు ఉంటుంది.

ధరలు, కలర్ ఆప్షన్లలో తేడా ఉన్నప్పటికీ అన్ని వేరియంట్ల స్టైల్, పనితీరు ఒకేస్థాయిలో ఉండటం విశేషం.

ఇంజిన్-పనితీరు

ఈ హంటర్ 350 బైక్‌లో 349CC జె-ఇంజిన్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తుంది. ఇది గరిష్టంగా 20.2bhp పవర్, 27Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లైట్‌వెయిట్ డిజైన్, ఈజీ హ్యాండ్లింగ్ కారణంగా నగర రోడ్లతో పాటు హైవేల్లో సౌకర్యంగా నడపవచ్చు. మైలేజీ విషయానికొస్తే ఇది 36.2kmpl ఇస్తుందని RE కంపెనీ చెబుతోంది.

Read More :

సగం ధరకే Galaxy S26 Ultra, Galaxy S26+.. బంపర్ స్కీమ్ తీసుకొచ్చిన శాంసంగ్!

పెట్రోల్ పోయించుకునేంత టైమ్‌లోనే 400 కి.మీల ఛార్జింగ్.. బివైడీ సంచలనం

మిడిల్ క్లాస్‌‌‌ కస్టమర్లను టార్గెట్ చేసిన ఆడి.. లగ్జరీ బ్రాండ్‌ నుంచి చవకైన ఎలక్ట్రిక్ కారు!