Audi A2 e-Tron | మిడిల్ క్లాస్‌‌‌ కస్టమర్లను టార్గెట్ చేసిన ఆడి.. లగ్జరీ బ్రాండ్‌ నుంచి చవకైన ఎలక్ట్రిక్ కారు!

Audi A2 e-Tron | జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) ఇప్పుడు మిడిల్ క్లాస్ కస్టమర్లను టార్గెట్ చేస్తుంది. చవకైన ధరలో Audi A2 e-Tron ఎలక్ట్రిక్ SUVని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

Audi A2 e-Tron | మిడిల్ క్లాస్‌‌‌ కస్టమర్లను టార్గెట్ చేసిన ఆడి.. లగ్జరీ బ్రాండ్‌ నుంచి చవకైన ఎలక్ట్రిక్ కారు!

Audi A2 e-Tron | జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) ఇప్పుడు మిడిల్ క్లాస్ కస్టమర్లను టార్గెట్ చేస్తుంది. చవకైన ధరలో Audi A2 e-Tron ఎలక్ట్రిక్ SUVని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత Audi A2 పేరును మళ్లీ తీసుకురావడం విశేషం. కాగా, ఈ మోడల్ ఆడి బ్రాండ్‌లో ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ SUVగా నిలవనుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటివరకు లగ్జరీ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ఆడి.. Audi A2 e-Tron మోడల్ ద్వారా మిడిల్ క్లాస్ కస్టమర్లపైనా ఫోకస్ చేసింది. ఈ కారు ప్రస్తుతం ఉన్న A1 హ్యాచ్‌బాక్, Q2 SUVలకు బదులుగా వస్తుంది. అంటే, ఆడి తన లైనప్‌ను మరింత సింపుల్‌గా మారుస్తూ.. భవిష్యత్తు ఎలక్ట్రిక్ మోడళ్లపై దృష్టి పెట్టిందని అర్థమవుతుంది. ఈ ఏడాది చివరలో ఈ మోడల్ కారు గ్లోబల్ మార్కెట్‌‌లోకి విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ కొత్త ఈవీ కారు ఫోక్స్‌వేగన్ గ్రూప్‌నకు చెందిన టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. Volkswagen ID.3 వంటి కార్లకు వాడిన MEB ప్లాట్‌ఫామ్‌తో రూపొందుతున్నది. దీనివల్ల ఈ ఆడీ కారు పనితీరు, రేంజ్, భద్రత విషయంలో కూడా ఇది మంచి స్థాయిలో ఉండే అవకాశాలున్నాయి. ఈ ఎస్‌యూవీని జర్మనీలోనే తయారు చేస్తున్నారు.

పాత మోడల్ నుంచి ఇన్‌స్పిరేషన్

డిజైన్ విషయానికొస్తే పాత Audi A2 మోడల్ నుంచి ఇన్‌స్పిరేషన్‌తో ఈ కొత్త ఈవీ వస్తుంది. తేలికపాటి నిర్మాణం, అద్భుతమైన ఏరోడైనమిక్ డిజైన్‌తో ఈ కారు రూపొందుతుందని సమాచారం. ఈ లక్షణాలు కేవలం డిజైన్‌కే పరిమితం కాకుండా, వాహనం పనితీరు మెరుగుపరచడంలో, డ్రైవింగ్ రేంజ్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఇక ఇంటీరియర్‌లో విశాలమైన కేబిన్‌తో వస్తుంది. దీనివల్ల లాంగ్‌డ్రైవ్‌లో కూడా అలసట లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఇక కారు లోపల ఆధునిక టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

ప్రతిరోజూ ఉపయోగించడానికి సరిపోయే ఎలక్ట్రిక్ మొబిలిటీని అందించడమే తమ లక్ష్యమని ఆడి కంపెనీ సీఈవో గెర్నాట్ డోలల్నర్ తెలిపారు. అందుకు Audi A2 e-Tron ప్రతీక అని పేర్కొన్నారు. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్లు, ధరల విషయాలను మాత్రం ఆయన బయటపెట్టలేదు. కానీ త్వరలోనే ఈ SUVకి సంబంధించిన మరిన్ని సాంకేతిక వివరాలు, ఫీచర్లు, ధరల వివరాలను అధికారికంగా ప్రకటించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ మోడల్ కారు వచ్చే ఏడాది మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఇన్నిరోజులు లగ్జరీ కార్లతో ఆకట్టుకున్న ఆడి.. ఇప్పుడు మిడిల్ క్లాస్ కస్టమర్లపై ఏ రేంజ్‌లో ప్రభావం చూపుతుందో చూడాలి.!

Read More :

కేవలం 6 లక్షలకే 7 సీటర్ కారు.. ఫ్యామిలీ ట్రిప్‌లకు వెళ్లే వారే టార్గెట్‌‌గా నిసాన్ కొత్త కారు!

హోండా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడల్‌పై 2 లక్షల దాకా డిస్కౌంట్!

5 నిమిషాల్లోనే ఛార్జ్ అయ్యే ఈవీ కారు.. ఆటోమొబైల్ రంగంలో సంచలనం