Honda Car Discounts | హోండా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడల్‌పై 2 లక్షల దాకా డిస్కౌంట్!

Honda Car Discounts | ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 2026లో హోండా కార్స్ ఇండియా భారీ ఆఫర్లు ప్రకటించింది. హోండా సిటీ, ఎలివేట్, అమేజ్ కార్లపై 2 లక్షల వరకు డిస్కౌంట్లు ప్రకటించింది.

Reported by: Chandram | వాణిజ్యం | Mar 16, 2026, 8:51 pm IST
Read Time: 5 mins
Honda Car Discounts | హోండా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడల్‌పై 2 లక్షల దాకా డిస్కౌంట్!

Honda Car Discounts | కొత్తగా కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్! జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా భారీ ఆఫర్లు ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా మార్చి నెలలో భారీ డిస్కౌంట్లను తీసుకొచ్చింది. దీంతో హోండా సిటీ (Honda City), ఎలివేట్ (Elevate), అమేజ్ (Amaze) కార్లపై రూ.2లక్షల దాకా ప్రయోజనాలు దక్కనున్నాయి..

హోండా సిటీ హైబ్రిడ్‌పై 1.97 లక్షల తగ్గింపు

హోండా కార్స్ లైనప్‌లో అత్యధిక డిస్కౌంట్ ఉన్న మోడల్ హోండా సిటీ హైబ్రీడ్. ఈ మోడల్ కారుపై గరిష్టంగా రూ.1.97 లక్షల వరకు రాయితీ లభిస్తుంది. ఈ కారులో 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్, 126 hp పవర్ అవుట్‌పుట్, e-CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటాయి. ముఖ్యంగా ఈ కారు మైలేజీ కూడా అధికంగానే ఉంటుంది. దాదాపు 27.1kmpl వరకు మైలేజీ ఇస్తుందని హోండా కంపెనీ పేర్కొంది. అంటే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో మైలేజీ కోరుకునే కస్టమర్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

హోండా సిటీ పెట్రోల్‌ వెర్షన్‌పైనా భారీ ఆఫర్లే ఉన్నాయి. ఈ నెలలో కొనుగోలు చేసే కొన్ని వేరియంట్లపై రూ.1.56 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ సెడాన్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 121hp పవర్, 145nm టార్క్ ఉంటాయి. అలాగే 6 స్పీడ్ మ్యాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

హోండా ఎలివేట్‌పైనా 1.56 లక్షల వరకు ఆదా

మిడ్‌సైట్ SUV సెగ్మెంట్‌లోని హోండా ఎలివెట్ కారుపై రూ.1.56 లక్షల వరకు డిస్కౌంట్‌ను హోండా ప్రకటించింది. ఇది భారత మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta), కియా సెల్టోస్ (Kia Seltos), ఫోక్స్‌వేగన్ టైగూన్ (Volkswagen Taigun), స్కోడా కుషాక్ (Skoda Kushaq) వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది. ఇక కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లో ఉన్న హోండా అమేజ్ మోడల్‌పై కూడా మంచి ఆపర్లే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న రెండు వెర్షన్లపై దాదాపు 75 వేల వరకు ప్రయోజనాలను అందిస్తున్నారు.

అయితే ఈ ఆఫర్లు సిటీ, డీలర్‌షిప్ స్టాక్, వేరియంట్‌ను బట్టి మారే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. కాబట్టి కారు కొనుగోలు చేయాలని అనుకునే కస్టమర్లు తమ సమీప హోండా డీలర్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించింది. మొత్తంగా ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో హోండా ప్రకటించిన ఈ ఆఫర్లు.. కొత్తగా కారు కొనాలని భావిస్తున్న వారికి మంచి అవకాశంగా మారాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read More:

5 నిమిషాల్లోనే ఛార్జ్ అయ్యే ఈవీ కారు.. ఆటోమొబైల్ రంగంలో సంచలనం

Kia Sonet 2026 | 10 లక్షల్లోపే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ SUV.. 2026 కియా సోనెట్ కొత్త వేరియంట్లు వచ్చేశాయి!