Egg Yolk | గుడ్డు పచ్చసొనతో కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? అధ్య‌య‌నాలు ఏం చెబుతున్నాయి..

ప్ర‌తి రోజు ఒక కోడి గుడ్డు (Egg ) తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది (Health Experts). అయితే, చాలా మంది గుడ్డులోప‌ల ఉండే ప‌చ్చ‌సొన‌ను (Egg Yolk) తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. ప‌చ్చ‌సొన కొలెస్ట్రాల్ స్థాయిల‌ను (Egg Yolk Increase Cholesterol), గుండె జ‌బ్బుల ప్ర‌మాదాన్ని పెంచుతుంద‌ని దాన్ని ప‌క్క‌కు పెట్టేస్తారు.

Egg Yolk

Egg Yolk | రోజూ ఓ గుడ్డు.. ఆరోగ్యానికి వెరీ గుడ్డు అంటారు ఆరోగ్య నిపుణులు. అంటే ప్ర‌తి రోజు ఒక కోడి గుడ్డు (Egg ) తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ని (Health Experts) అర్థం. అందుకే చాలా మంది రోజూ త‌మ ఆహారంలో ఉడికించిన గుడ్డును భాగం చేసుకుంటారు. ఎగ్‌లో చాలా పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ప్రొటీన్లు, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, అవ‌స‌ర‌మైన విట‌మిన్లు, ఖ‌నిజాలు ల‌భిస్తాయి.

ప‌చ్చ‌సొన‌లోనే పోష‌కాలు అధికం..

అయితే, చాలా మంది గుడ్డులోప‌ల ఉండే ప‌చ్చ‌సొన‌ను (Egg Yolk) తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. అది తింటే స్మెల్ వ‌స్తుంద‌ని కొంద‌రు, ప‌చ్చ‌సొన కొలెస్ట్రాల్ స్థాయిల‌ను (Egg Yolk Increase Cholesterol), గుండె జ‌బ్బుల ప్ర‌మాదాన్ని పెంచుతుంద‌ని దాన్ని ప‌క్క‌కు పెట్టేస్తారు. కేవ‌లం తెల్ల‌సొన మాత్ర‌మే తినేస్తారు. వాస్త‌వానికి గుడ్డు మొత్తంలో ఇందులోనే చాలా పోష‌కాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. తెల్ల‌సొన‌తో పోలిస్తే.. ప‌చ్చ‌సొన‌లో విట‌మిన్ ఏ, విట‌మిన్ ఇ, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వంటివి పుష్క‌లంగా ఉంటాయ‌ని ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ అలోక్ చోప్రా వివరించారు. ప‌లు పరిశోధనల ప్రకారం..కేవలం కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడి పచ్చసొన తినడం మానేస్తే ఎన్నో పోషకాలను కోల్పోతున్నట్టే. పరిమితంగా గుడ్డులోని పచ్చసొనను తీసుకోవడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలపై పెద్దగా ప్రభావం ఉండదు.

పచ్చసొన గుండెకు హానికరమా..?

చాలా మంది గుడ్డులోని ప‌చ్చ‌సొన తింటే గుండెకు హానిక‌ర‌మ‌ని చాలా మంది దీన్ని తినేవారుకాదు. కానీ మెజారిటీ జ‌నాభాలో మ‌నం ఆహారం ద్వారా తీసుకునే కొలెస్ట్రాల్ ర‌క్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిల‌పై చాలా త‌క్కువ ప్ర‌భావాన్ని చూపుతుంద‌ని ఆధునిక ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి. ఒక‌వేళ దీన్ని తిన‌డం వ‌ల్ల‌ మీ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిన‌ట్లైతే.. అది సాధార‌ణంగా మంచి కొలెస్ట్రాల్ అయి ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇవి చెడు కొలెస్ట్రాల్‌పై సానుకూల ప్ర‌భావం చూపి మీ ఆరోగ్యాన్ని కాపాడ‌టంలో సాయ‌ప‌డ‌తాయ‌ట‌.

ఎవరు నివారించాలి..?

గుడ్డు ఆరోగ్యానికి మంచిదే అయిన‌ప్ప‌టికీ.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం గుడ్డులోని పచ్చసొనను అవాయిడ్ చేస్తే మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇప్ప‌టికే గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారు గుడ్డు తీసుకోవ‌డంలో జాగ్ర‌త్త వ‌హించాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. అలాంటివారు ప‌చ్చ‌సొన తీసుకోవ‌డం త‌గ్గించడం మంచిద‌ని లేదంటే వైద్యుడిని సంప్ర‌దించి తీసుకుంటే బెట‌ర్ అని హెచ్చ‌రిస్తున్నారు. వారే కాదు, డయాబెటిస్,ఆర్థరైటిస్, కీళ్ల వాతానికి సంబంధిత స‌మ‌స్య‌ల ఉన్న వాళ్లు ప‌చ్చ‌సొన‌ను తిన‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Lord Ganesh | ట్రైన్‌లో గ‌ణేషుడికీ ఓ బెర్త్‌.. ఉద‌యం, సాయంత్రం పూజ‌లు
Nidhhi Agerwal | పింక్ చీరలో నిగనిగలాడుతూ నిధి అగర్వాల్

Latest News