Harsh Goenka | ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంత బిజీగా ఉన్నా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికర విషయాలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ప్రజలకు చేరువలో ఉంటుంటారు. ఆయన షేర్ చేసే వీడియోలు, పోస్టులు ప్రజలకు స్ఫూర్తిని కలిగించేవిగా ఉంటాయి. తాజాగా, ఆయన మరో ఆసక్తికర వీడియోతో నెటిజన్లను పలకరించారు.
చైనా (China)లోని కొండ ప్రాంతాలు సోలార్ విద్యుత్ కేంద్రాలుగా (solar power plants) మారిపోయిన ఓ ఆసక్తికర వీడియోని హర్ష గోయెంకా షేర్ చేశారు. మన దేశంలో కొండ ప్రాంతాల్లో కాఫీ, టీ తోటలను పెంచినట్లు.. చైనీయులు అక్కడ కొండ ప్రాంతాలను సోలార్ విద్యుత్ కేంద్రాలుగా మార్చారు. సోలార్ ప్యానెల్స్‌ను వరుసగా ఏర్పాటు చేశారు. వృథాగా ఉన్న కొండలను ఉపయోగించి భారీగా కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ వీడియోని గోయెంకా షేర్ చేస్తూ.. పర్యావరణానికి మేలు చేస్తూ, టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్న చైనా తీరును పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ప్రశంసించారు. అయితే, చైనాలో సౌర విద్యుత్ కేంద్రాలు. భారీ స్థాయిలో సౌర విద్యుత్తు సరైన ఆలోచనే. కానీ ఇందుకోసం ప్రకృతి దృశ్యాలను పణంగా పెట్టాలా..? అంటూ క్యాప్షన్ జోడించారు.
నిజమైనదా.. లేక ఏఐ వీడియోనా..?
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది మంచి ఆలోచనే అని ప్రశంసిస్తున్నారు. చైనీయులు టెక్నాలజీని అద్భుతంగా ఉపయోగిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇది నిజమైన వీడియోనేనా..? లేక ఏఐ ద్వారా క్రియేట్ చేసినదా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఫ్యాక్ట్ చెక్ చేపట్టాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవి కూడా చదవండి :
Jaahnavi Kandula : జాత్యాహంకారానికి చెంపపెట్టు..జాహ్నవి కుటుంబానికి రూ.262కోట్ల పరిహారం
ఏపీలో తోటి విద్యార్ధుల అమానుష దాడి..అపస్మారక స్థితిలో విద్యార్థి
