ఏపీలో తోటి విద్యార్ధుల అమానుష దాడి..అపస్మారక స్థితిలో విద్యార్థి

గుంటూరు వడ్లమూడి విజ్ఞాన్ కాలేజీలో దారుణం! తోటి విద్యార్థిపై ఇనుప రాడ్లతో మూకుమ్మడి దాడి. అపస్మారక స్థితిలో బాధితుడు. వైరల్ వీడియోతో ఏపీలో రాజకీయ రగడ.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Feb 12, 2026, 3:49 pm IST
Read Time: 4 mins
ఏపీలో తోటి విద్యార్ధుల అమానుష దాడి..అపస్మారక స్థితిలో విద్యార్థి

అమరావతి : ఏపీలో ఓ విద్యార్థినిపై తోటి విద్యార్ధులు చేసిన అమానుష దాడి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ దాడిలో బాధిత విద్యార్ధి తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటం విషాదకరం. ఏపీ గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ కాలేజీకి చెందిన విద్యార్థులు…తోటి విద్యార్థిని సమీప తోట‌లోకి తీసుకెళ్లి దారుణంగా మూకుమ్మడి దాడి చేశారు. కాళ్ల‌తో త‌న్నుతూ, ఇనుప రాడ్ల‌తో బ‌లంగా కొడుతూ వీడియో చిత్రీక‌రించారు. దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన బాధిత విద్యార్థి అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లాడు.

తనను కొట్టవద్దని వదిలేయని కాళ్ల వేళ్లాపడిన వినిపించుకోకుండా రాక్షస మూక మాదిరిగా ఆ విద్యార్థిని చితకబాదిన తీరు అందరిని కలిచి వేసింది. పిల్ల‌ల‌ను కాలేజీకి పంపించాలంటేనే త‌ల్లిదండ్రులు సైతం భ‌య‌ప‌డేలా ఉన్న ఈ దాడి ఘటన వీడియో చూసిన వారంతా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యార్థినిపై దాడి ఘటన ఆధారంగా ప్రతిపక్ష వైసీపీ అధికార టీడీపీ కూటమిపై విమర్శలతో విరుచుకపడుతుండటంతో వివాదం రాజకీయ రంగు పులుముకుంది.

 

ఇవి కూడా చదవండి :

Lord Ganesh | ట్రైన్‌లో గ‌ణేషుడికీ ఓ బెర్త్‌.. ఉద‌యం, సాయంత్రం పూజ‌లు
Gold Silver Rates Today | తగ్గిన బంగారం, వెండి ధరలు