Gold Silver Rates Today | తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,200 తగ్గి రూ.1,58,400కు చేరింది. కిలో వెండి రూ.3 లక్షల వద్ద స్థిరంగా ఉంది.
విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గుదలను నమోదు చేశాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి దూకుడుగా పెరిగిన బంగారం, వెండి ధరలు జనవరి 29న ఆల్ టైమ్ రికార్డు పెరుగుదలను అందుకుని..ఆ తర్వాత అనూహ్యంగా పడిలేస్తు హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతున్నాయి. గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1200 తగ్గి..రూ.1,58,400 లకు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,100తగ్గి రూ. 1,45,200 వద్ద కొనసాగుతుంది.
రూ.3లక్షల మార్కు వద్దనే కిలో వెండి ధర
కిలో వెండి ధర నాలుగు రోజులుగా రూ.3,00000లక్షల మార్కు వద్దనే నిలకడగా కొనసాగుతుంది. జనవరి 29న కిలో వెండి ధర రూ.4,25,000కు చేరుకుని ఆ తర్వాత వేగంగా పడిపోతూ..ఫిబ్రవరి 6వ తేదీన రూ.2,80,000లకు పడిపోయింది. తిరిగి నెమ్మదిగా పుంజుకుని ప్రస్తుతం రూ.3లక్షల మార్కు వద్దనే స్థిరంగా నిలిచింది.
అయితే భవిష్యత్తులో బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయని, వెండి ధరల పెరుగుదలకు కొంతకాలం పడుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా సెంట్రల్ బ్యాంక్ (Fed) వడ్డీ రేట్లు, బలహీన పడిన డాలర్, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాలు క్రమంగా బంగారం, వెండి ధరలను ధీర్ఘకాలంలో బలోపేతం చేస్తాయంటున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం బంగారం, వెండి ధరలు తగ్గిన నేపథ్యంలో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
Gram Panchayat : తెలంగాణ గ్రామ పంచాయతీలకు రూ.387కోట్లు విడుదల
Lok Sabha Speaker | స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసా.. గతంలో ఎన్నిసార్లు జరిగింది..?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram