• Telugu News
  • /Telangana

Gram Panchayat : తెలంగాణ గ్రామ పంచాయతీలకు రూ.387కోట్లు విడుదల

తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులుగా రూ.387 కోట్లు విడుదల చేసింది. రెండు విడతల్లో రూ.646.36 కోట్లు జమ అయ్యాయి. ఇంకా రూ.2,400 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Feb 12, 2026, 2:40 pm IST
Read Time: 2 mins
Gram Panchayat : తెలంగాణ గ్రామ పంచాయతీలకు రూ.387కోట్లు విడుదల

విధాత, హైదరాబాద్ : తెలంగాణ గ్రామపంచాయతీలకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.387 కోట్లు విడుదల చేసింది. ఇటీవల మొదటి విడతగా ఇప్పటికే రూ. 259.36 కోట్లు విడుదల చేసింది. రెండువిడతల్లో కలిపి మొత్తం రూ. 646.36 కోట్లు నిధులు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు విడుదలయ్యాయి.

తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం కింద సుమారు రూ. 3,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి, కేంద్రం కోరిన సమాచారాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణ అభివృద్ధి శాఖ సమర్పించడంతో పెండింగ్ నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. మరో రూ. 2,400 కోట్లు విడుదల కావాల్సి ఉంది. గ్రామాల అభివృద్ధి కోసం పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కేంద్రాన్ని కోరారు.

ఇవి కూడా చదవండి :

Pakadwa Marriage | బీహార్‌లో వెలుగులోకి పకడ్వా వివాహ్‌.. యువ‌కుడికి డ్ర‌గ్స్ ఇచ్చి మ‌రీ..
Parliament | షాకింగ్‌.. పార్ల‌మెంట్‌లో దారుణంగా కొట్టుకున్న నేత‌లు