Aditi Rao hydari| అదితి రావు హైదరి గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు ఇటీవల సిద్ధార్థ్‌తో జరిగిన ఎంగేజ్‌మెంట్ ఇష్యూతో వార్తలలో నిలిచింది. మహాసముద్రం సినిమా సమయంలో అతనితో ప్రేమలో పడిన అదితి నిశ్చితార్థం కూడా చేసుకొని పెళ్లికి సిద్ధంగా ఉంది. అయితే అదితిరావు హైదరికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.గతంలో అదితి రావు హైదరి ఫొటోలు కొన్ని బయటకు రాగా, అప్పటి లుక్‌కి ఇప్పటి లుక్‌కి పొంతనే లేదని, ఈమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా ఏంటి అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె మెక్కు, ఫేస్, కళ్లు, కలర్, మారాయి. ఆహారంలో చేసిన మార్పు వలన అయితే ఇలా జరిగి ఉండదు అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
కొన్ని సర్జరీలు, ఫిల్లర్స్, న్యూ ఏజ్ ఫేసియల్ రీ కనస్ట్రక్షన్ జాబ్స్ వల్ల ఆమెలో ఇలాంటి మార్పు వచ్చి ఉండవచ్చని చెబుతున్నారు. గతంలో అదితి ముక్కు కాస్త పెద్దగా ఉండేది. అయినా కూడా చాలా అందంగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ను మించిన అందంతో కనిపించేది. కాని ఈ అమ్మడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం వల్లనే అలా మారింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అదితిరావు ఫొటోలు ఓ ప్లాస్టిక్ సర్జన్ చూసి కామెంట్ చేస్తూ… నేను ఓ సర్జన్ ని , నాకు ఇప్పటికీ అర్దం కాదు సెలబ్రెటీలు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నప్పుడు ఆ విషయం చెప్పటానికి ఎందుకో ఇష్టపడరు. అందులో తప్పేముందో తెలియదు. పబ్లిక్ గా చెప్తే మరింత మందికి ఈ ప్లాస్టిక్ సర్జన్ గురించి తెలిసే అవకాసం ఉంటుందని చెప్తున్నారు.
అదితిరావు అసలు రూపం అయితే కనుమరుగు అయ్యిపోయి కొత్త రూపు వచ్చింది. ఇది ఎలా వచ్చింది, ఆమె చేయించుకున్న సర్జరీ సక్సెస్ అయినట్టా లేదా, అదే దానిపై క్లారిటీ లేదు అంటుంది బాలీవుడ్ మీడియా. ఇక అదితి కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తుంది. ఆమె సిద్ధార్థ్‌తో వివాహానికి సిద్ధమవుతుండగా,ఆయనని పెళ్లి చేసుకున్నాక సినిమాలకి దూరమయ్యే అవకాశం కూడా ఉందని కొందరు అంటున్నారు.