డెడికేష‌న్ అంటే ఇది క‌దా.. డూప్ లేకుండా ప్రాణాల‌కి తెగించి అజిత్ స్టంట్

  • Publish Date - April 4, 2024 / 06:00 PM IST

త‌ల అజిత్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. వైవిధ్య‌మైన సినిమాలో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్నాడు. త‌మిళ‌నాట ఆయ‌న ఫ్యాన్ ఫాలోయింగ్ పీక్స్‌లో ఉంటుంది. అజిత్ అంటే మ‌న‌కు ఠ‌క్కున గుర్తుకొచ్చేది బైక్ రైడింగ్‌, రిస్కీ స్టంట్స్. వంద‌ల కిలో మీట‌ర్లు బైక్ రైడింగ్ చేసే అజిత్ షూటింగ్స్‌లో రిస్కీ స్టంట్స్ చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాడు. డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేయడం అజిత్‌కి కొత్తేమి కాదు. ఎన్నో సినిమాల్లో అజిత్ రిస్కీ స్టంట్స్ చేసి ప్రమాదానికి గురయ్యారు. ‘వలిమై’ సినిమాలో కూడా రిస్కీ షాట్స్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ప్ర‌స్తుతం అజిత్ ఏకే 62గా ‘విడ ముయిర్చి’ సినిమా చేస్తున్నారు. దర్శకుడు మగిజ్ తిరుమేని ప్రెజెంట్ ఈ మూవీలోని కారు యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు.

గ‌త కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇందులో త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తుంది. చిత్రానికి టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ ద‌ర్శ‌కుడు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గ‌తేడాది న‌వంబ‌ర్‌లో ఈ సినిమా షూటింగ్ అజ‌ర్‌బైజాన్ దేశంలో జ‌రుపుకుంది. ఆ షూటింగ్‌కు సంబంధించి ఒక వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ షూటింగ్‌లో భాగంగా అజిత్ డూప్ లేకుండా రిస్కీ స్టంట్ చేయ‌గా.. కారు అదుపుత‌ప్పి వాహనం బోల్తా పడింది. అయితే కారు ప్ర‌మాదంకి గురైన స‌మ‌యంలో అజిత్ స్వ‌యంగా కారు న‌డుపుతున్న‌ట్టు క‌నిపిస్తుంది. అయితే ఈ ప్ర‌మాదంలో అజిత్‌కు ఏమి కాలేదని మేకర్స్ వెల్లడించారు. ఇది జ‌రిగి 5 నెల‌లు కాగా, ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

అజిత్ డూప్ లేకుండా ఇలా రిస్క్ స్టంట్స్ చేయ‌వ‌ద్దని అభిమానులు వేడుకుంటున్నారు. గ‌తంలో మంకత్తా(తెలుగులో గ్యాంబ్ల‌ర్) సినిమా కోసం కూడా అజిత్ డూప్ లేకుండా బైక్ రైడింగ్ చేశాడు. అయితే తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన వీడియో చూస్తే.. ప్రమాద సమయంలో కారు బాగా డ్యామేజ్ అయ్యినట్లు షూటింగ్ వీడియో ద్వారా అర్ధ‌మవుతుంది. . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. లైకా ప్రొడక్షన్స్ ఈ వీడియోల‌కి ఇంట్రెస్టింగ్ క్యాప్ష‌న్ పెట్టింది… “ధైర్యానికి హద్దులేమీ ఉండవు. విదా ముయర్చి కోసం అజిత్ కుమార్ చేసిన ఈ సాహసోపేతమైన స్టంట్ సీక్వెన్స్ అతని డెడికేషన్ కు అద్దం పడుతుంది” అని పేర్కొంది.

Latest News