Akhil| అక్కినేని మూడోతరం వారసుడు అఖిల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సిసింద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించిన నాగార్జున వారసుడు అఖిల్ మూవీతో వెండితెరపై హీరోగా సందడి చేశాడు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. సోషియో ఫాంటసీ అంశాలతో ఈ మూవీ తెరకెక్కగా, డెబ్యూ మూవీనే పెద్ద దెబ్బ కొట్టింది. మాస్ హీరోగా అఖిల్ ని నిలబెట్టాలన్న నాగార్జున ప్లాన్ బెడిసి కొట్టింది. లాభం లేదని రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ వైపు తన తనయుడిని మళ్లించిన ఫలితం లేకుండా పోయింది. అఖిల్ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మాత్రమే ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది.
ఈ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కగా, ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. మూవీ సక్సెస్ ఎక్కువ భాగం పూజా ఖాతాలోకి వెళ్లడంతో అఖిల్‌కి నిరాశే ఎదురైంది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే చిత్రం చేశాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నా ఈ మూవీ కూడా భారీ డిజాస్టర్ అయింది. అఖిల్ ప్రతి సినిమాకి ఎంతో కష్టపడి పని చేస్తున్నా కూడా మంచి సినిమాలు అనేవి ఆయనని రాకపోవడం అక్కినేని ఫ్యాన్స్ ని సైతం కలవరపరుస్తుంది. ఈ సారి మాత్రం ఎలా అయిన సాలిడ్ హిట్ కొట్టాలని అఖిల్ కసితో ఉన్నాడు.
తన నెక్ట్స్ సినిమాతో అభిమానుల కోరికను నెరవేర్చాలని ఆరాటపడుతున్నాడు అఖిల్. అందుకోసం తన గెటప్ ను పూర్తిగా మార్చి సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. అఖిల్ లేటెస్ట్ లుక్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అస్సలు గుర్తు పట్టకుండా మారిపోయాడని అంటున్నారు. లాంగ్ హెయిర్, గడ్డం తో సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు. ఆయన లుక్ హాలీవుడ్ హీరోలను తలపిస్తుంది. అఖిల్ మేకోవర్ చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ఈ మేకోవర్ మెుత్తం తన నెక్ట్స్ మూవీ కోసమే అని టాక్. అయితే అఖిల్ నెక్ట్స్ మూవీ గురించి ఇంకా ఎలాంటి అప్‌డేట్ అయితే లేదు.