విధాత : అల్లరి నరేష్(Allari naresh) హీరోగా నటిస్తున్న ఆల్కహాల్ మూవీ(Alcohol Movie) నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. టీజర్ లోని సన్నివేశాలు అల్లరి నరేష్ మార్క్ కామెడీతో పాటు సస్పెన్స్ తో కొనసాగి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. మందు తాగాని వ్యక్తితో బలవంతంగా మందు తాగిస్తే.. ఏర్పడిన పరిణామాలు ఏంటి అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఫ్యామిలీ డ్రామా ఫేమ్ మోహర్ రాజ్(Mohar Raj) దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్(Sitara Entertainments), శ్రీకర స్టూడీయోస్(Srikara Studios), ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌లపై నాగవంశీ(Nag Vamsi), త్రివిక్రమ్(Trivikram) సతీమణి సాయి సౌజన్య(Sai Soujanya) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ 63వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా షూటింట్ తుది దశకు చేరుకుంది. ఆల్కహాల్ మూవీలో కామెడియన్ సత్యతో పాటు రుహాని శర్మ(Ruhani Sharma)(హీరోయిన్), నిహారిక ఎన్ఎమ్(Niharika NM) తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.
అల్లరి నరేష్(Allari Naresh) ప్రస్తుతం‘12ఏ రైల్వేకాలనీ’(12A Railway Colony) అనే ఓ హారర్ మూవీ కూడా చేస్తున్నాడు . ‘పొలిమేర’(Polimera) ఫేమ్ అనిల్ విశ్వనాథ్(Anil Vishwanath) కథ అందించిన ఈ సినిమాకు నాని కాసరగడ్డ డైరెక్టర్. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల, సాయికుమార్, వైవా హర్ష వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.