Allu Aravind | విధాత : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి..దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ(94) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజూమున 1.45గంటలకు వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు. ఆమె పార్ధీవ దేహాన్ని అల్లు అరవింద్ నివాసంలో బంధు మిత్రులు, ప్రజల సందర్శనార్ధం ఉంచారు. మధ్యాహ్నం తర్వాత కోకాపేట లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నానమ్మ మరణ వార్త సమాచారంతో ఉదయమే అల్లు అర్జున్ ముంబై నుంచి బయలుదేరి తన తండ్రి నివాసానికి చేరుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు అల్లు కనకరత్నమ్మ పార్ధీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అల్లు అరవింద్ ను పరామర్శించారు. అమ్మమ్మ మరణంతో రాంచరణ్ మైసూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సోదరుడు నాగబాబులు వైజాగ్ లో జరగనున్న పబ్లిక్ మీటింగ్ అనంతరం రేపు వచ్చి అల్లు కుటుంబాన్ని కలిసి సంతాపం తెలియచేయనున్నారు.