విధాత : హీరోయిన్ రాశీఖన్నా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగింది. ఈ భామ తమిళంలో ఇమైకా నొడికల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. రాశి ఖన్నా చివరిగా ధనుశ్, నిత్యామీనన్ జంటగా నటించిన తిరుచిత్రంబలం చిత్రంలో కీలకపాత్రను పోషించారు. ఆ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. అయినా ప్రస్తుతం రాశి ఖన్నా వరుసగా చిత్రాలు చేయడం లేదు. తెలుగులో సిద్దు జొన్నల గడ్డతో ‘తెలుసు కదా’ మూవీతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో మరో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి కూడా ఉన్నారు.
కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఇదోక కొత్త తరహా ప్రేమకథా చిత్రమని రాశీఖన్నా వెల్లడించారు. ప్రస్తుతం రాశీఖన్నా పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రంతో పాటు హిందీలో చేసిన ‘120 బహదూర్’ చిత్రం నవంబరు 21న విడుదలవుతుంది. విక్రాంత్ మెస్సేతో లవ్ స్టోరీ ఫిల్మ్, మాధవన్‌తో టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్ మూవీ నటించింది. ‘ఫర్జీ 2’ సిరీస్ లోనూ, మరో ఓటీటీ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ పోషించింది.