Anikha Surendran: అనైకా కూడా.. స్టార్ట్ చేసిందిగా

బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న అనైకా సురేంద్రన్‌ ఇప్పుడు గ్లామర్‌ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా చేసిన ఫొటోషూట్‌లో ఆమె పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్‌ అయి నెటిజన్‌ల దృష్టిని ఆకర్షించింది. చిన్నతనంలోని అమాయక లుక్‌కి భిన్నంగా, ఈసారి స్టైలిష్‌ అవతారంలో మెరిసిన అనైకా కొత్త అందాలతో చర్చనీయాంశమైంది.

Anikha Surendran

Anikha Surendran

ఐదేండ్ల క్రితం బాలనటిగా ప్రేక్షకుల మనసు గెలుచుకున్న చిన్నారి అనైకా సురేంద్రన్‌ (Anikha Surendran) ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా మారిపోయింది. అజిత్‌ సినిమాల్లో ఆయన కూతురిగా కనిపించి అందరినీ ఆకట్టుకున్న ఆ చిన్నారి, ఇప్పుడు హీరోయిన్‌గా సౌత్‌ సినిమాల్లో తనదైన గుర్తింపు ద‌క్కించుకుంటోంది.

అవకాశాలు పరిమితంగానే ఉన్నా, తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషల్లో కీలక పాత్రలు చేస్తూ తన హావా చాటాల‌ని చూస్తోంది. తెలుగులో నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమాలో స్కూల్‌ విద్యార్థిగా నటించిన అనైకా, తర్వాత కుందనపు బొమ్మ చిత్రంలో కథానాయికగా మెరిసి ఆకట్టుకుంది. త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ మొయిన్ లీడ్‌గా చేసింది.

అయితే ఈ భామ.. సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. తరచూ కొత్త ఫొటోషూట్‌లతో తన గ్లామర్ డోస్ పెంచుతూ, అభిమానుల హార్ట్‌బీట్స్‌ను వేగంగా కొట్టిస్తోంది. ఇప్పటివరకు ఓ పద్ధతిగానే కనిపించిన అనైకా, తాజాగా చేసిన ఫొటోషూట్‌లో త‌న‌లోని కొత్త‌ ట్రాన్స్‌ఫర్మేషన్ చూపించి షాకిచ్చింది.. వాటిని చూసి నెటిజన్లు ఒక్క‌సారిగా ఖంగుతిన్నారు.

నిజంగా చూస్తున్న‌ది అనైకానేనా ఇంత గ్లామర్ డోస్ పెంచింది అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. చిన్న తనంలో అమాయకంగా కనిపించిన ఈ అందాల భామ ఇప్పుడు స్టైలిష్ డివా‌గా అందరినీ ఆకట్టుకుంటోంది.