విధాత: రాయన్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నిర్మించడంతో పాటు రచించి, దర్శకత్వం వహించిన సినిమా నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్ (నీక్) (Nilavuku En Mel Ennadi Kobam). జీవీ ప్రకాశ్ కుమార్ (Gv Prakashkumar) సంగీతం అందించాడు. అనైక సురేంద్రన్ (Anikha Surendran), ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Warrier) , పవీశ్, మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటించారు.
తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమా ఫిబ్రవరి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గొల్డెన్ స్పారో (Golden Sparrow) అనే వీడియో సాంగ్ తమిళనాట పెద్ద సంచలనమే సృష్టించింది. ప్రియాంకా మోహన్ ప్రత్యేకంగా నృత్యం చేయడం విశేషం. ఇప్పుడు ఈ పాట తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేశారు.జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ సాగే ఈ పాటకు రాంబాబు గోసాల ఈ పాటకు లిరిక్స్ అందించగా అశ్విన్ సత్య, సుభలాషిణి, సుదీశ్ శశికుమార్ ఆలపించారు. మీరూ చూసేయండి.