Kriti Sanon | హీరోలు నా ముందు హీల్స్ వేసుకుంటారు.. కృతి సనన్ కామెంట్స్‌పై మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం

Kriti Sanon | బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ పొందిన కృతి సనన్‌కి తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. మహేష్ బాబుతో ‘వన్ నేనొక్కడినే’, నాగ చైతన్యతో ‘దోచేయ్’, ప్రభాస్‌తో ‘ఆదిపురుష్’ వంటి పెద్ద సినిమాల్లో నటించినప్పటికీ, ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడంతో ఆమెకు తెలుగు ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు రాలేదు.

Kriti Sanon | బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ పొందిన కృతి సనన్‌కి తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. మహేష్ బాబుతో ‘వన్ నేనొక్కడినే’, నాగ చైతన్యతో ‘దోచేయ్’, ప్రభాస్‌తో ‘ఆదిపురుష్’ వంటి పెద్ద సినిమాల్లో నటించినప్పటికీ, ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడంతో ఆమెకు తెలుగు ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు రాలేదు. బాలీవుడ్‌లో వరుసగా హిట్స్ అందుకుంటున్న కృతి.. తాజాగా ధనుష్ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘తేరే ఇష్క్ మే’తో బ్లాక్‌బస్టర్ దక్కించుకుంది.ఈ నేపథ్యంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారి తీసాయి.

యాంకర్ కృతి ఎత్తు గురించి ప్రస్తావించగా, దానికి స్పందించిన కృతి సనన్.. “నేను చాలా ఎత్తుగా ఉంటాను. నాతో నటించిన హీరోల్లో చాలా మంది నాకంటే పొట్టివారే. వాళ్లు నాతో నిలబడే సీన్లలో హీల్స్ వేసుకునేవాళ్లు. నేను మాత్రం ఎల్లప్పుడూ ఫ్లాట్ ఫుట్‌వేర్ వేసుకునేదాన్ని. ప్ర‌భాస్, అర్జున్ కపూర్ మాత్రమే నాకంటే ఎత్తుగా ఉన్న హీరోలు” అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

మహేష్ బాబు ఫ్యాన్స్ ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు?

కృతి చేసిన ఈ కామెంట్‌ ఒక్కసారిగా మహేష్ బాబు అభిమానుల్లో అసంతృప్తిని రేకెత్తించింది. ‘వన్ నేనొక్కడినే’తో కృతి సనన్‌కు తొలి బ్రేక్ ఇచ్చింది మహేష్ బాబే. అంతే కాకుండా ఆయన ఎత్తు కూడా కృతి కంటే ఎక్కువే. ఇలా ఉండగా, “నా కంటే ఎత్తుగా ఉన్నవారు ప్రభాస్, అర్జున్ కపూర్ మాత్రమే” అంటూ కృతి చెప్పిన మాటే ఫ్యాన్స్‌కు నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు ఇలా రియాక్ట్ అవుతున్నారు.

కృతి సనన్‌కు మహేష్ బాబు ఎత్తు గుర్తు లేదా?, ఫ్యాక్ట్స్ తెలుసుకుని మాట్లాడాలి, తన మొదటి తెలుగు హీరో పేరు ప్రస్తావించకపోవడం అసభ్యంగా ఉంది, మహేష్ బాబు లాంటి హీరోతో చేసిన సినిమా కూడా గుర్తు పెట్టుకోలేదా? వంటి ఈ కామెంట్లు గంటల వ్యవధిలోనే వైరల్ అవుతూ హాట్ డిబేట్‌గా మారాయి.

కృతి ఉద్దేశ్యం ఏమిటి?

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, కృతి ఎవరి పట్లా ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని, ఆమె చెప్పినది సాధారణ విషయమే అని భావిస్తున్నారు. తాను ఎక్కువ ఎత్తు కలిగిన నటి కావడంతో చాలా సందర్భాల్లో సీన్ల కోసం హీరోలు హీల్స్ వేసుకునేవారని చెప్పడమే ఆమె ఉద్దేశ్యమని చెబుతున్నారు. కానీ మహేష్ ఫ్యాన్స్‌ను సంతృప్తిపరచడానికి ఆమె నుంచి ఒక క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశముందనే టాక్ కూడా వినిపిస్తోంది. గతంలో కూడా ఆమె కొన్ని కామెంట్లు తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు వెంటనే క్లియర్ చేసింది. కాబట్టి మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న డిమాండ్ మేరకు కృతి స్పందిస్తుందా? లేకుంటే కొద్ది గంట‌ల త‌ర్వాత ఈ విష‌యం సైలెంట్ అవుతుందా అనేది చూడాలి.

Latest News