కాంగ్రెస్ పార్టీకి త్వరలో జీవన్ రెడ్డి రాజీనామా?

సీనియర్ కాంగ్రెస్ నేత టి. జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

T. Jeevan Reddy

విధాత : మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్ తో తన సుధీర్ఘ బంధాన్ని తెంచుకోవాలనుకున్నారా? అంటే ఆయన అనుచరవర్గం నుంచి అవునన్న సమాధానం వినవస్తుంది. జీవన్ రెడ్డి ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత..పార్టీలో తనకు తగిన గౌరవం, సముచిత స్థానం దక్కడం లేదంటూ జీవన్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఆవేదన వెళ్లగక్కారు. కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తన అసంతృప్తిని తెలియజేసినప్పటికి ఆశించిన స్పందన కనిపించకపోవడం ఆయనను మరింత నిరాశ పరిచింది.

గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా ఏళ్ల తరబడిగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనను కాదని, వలస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కాంగ్రెస్ నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కాంగ్రెస్ కు గుడ్ బై కొట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. సన్నిహితులు, ఆప్తులతో మంతనాల తరువాత కాంగ్రెస్ కు రాజీనామా చేయాలని తుది నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

ఇప్పటికే జీవన్ రెడ్డి బీఅర్ఎస్ అధినేత కేసీఅర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సైతం మంతనాలు జరిపినట్లుగా ప్రచారం చోటుచేసుకోవడం ఆసక్తికరం. దీంతో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆనంతరం ఆయన బీఆర్ఎస్ లో చేరవచ్చని అనుచర వర్గాల కథనం.

ఇవి కూడా చదవండి :

హైదరాబాద్ ‘రీజినల్ రింగ్ రైల్’ కు కేంద్ర రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్
జర్నలిస్టు సంక్షేమానికి స్టాలిన్ సర్కార్ కీలక ఆదేశాలు

Latest News