ఎల్పీజీ కొరత ఎఫెక్ట్ ..ఢిల్లీలో కట్టెల పొయ్యిలకు కేంద్రం అనుమతి!

ఎల్పీజీ గ్యాస్ కొరత నేపథ్యంలో ఢిల్లీలో కట్టెల పొయ్యిల వినియోగంపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

న్యఢిల్లీ : దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కట్టెల పొయ్యిల వినియోగంపై నిషేధం ఎత్తివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఢిల్లీ వాసులు కట్టెల పొయ్యిలు వాడేందుకు అనుమతిస్తున్నట్లుగా తెలిపింది.

ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ, నగర వాసుల ఆరోగ్యంతో పాటు భద్రతా కోణంలో గతంలో కట్టెల పొయ్యిల వినియోగంపై నిషేధం విధించింది. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ)328 దాటిపోవడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం పర్యావరణ పరిరక్షణకు పలు చర్యలు తీసుకుంది. హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో బొగ్గుతోపాటు కట్టెల పొయ్యిలను కూడా వాడొద్దని ఆదేశాలు ఇచ్చింది. అయితే పశ్చిమాసియా యుద్ద పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఎదురవ్వడంతో తాత్కాకలికంగా కట్టెల పొయ్యిలపై నిషేధం ఎత్తివేస్తున్నట్లుగా పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

Meta Layoffs : మెటాలో 16వేల మంది ఉద్యోగాల తొలగింపు ?
Rajasekhar | హీరో రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ ప్రారంభించారా.. కోట్లు సంపాదిస్తున్నారంటూ వార్త‌లు..

Latest News