Hair Care | జుట్టు ఆరోగ్యంగా, మెరిసేలా ఉండటంతో పాటు వెంట్రుకలు రాలే సమస్య తగ్గాలంటే తరచూ తలస్నానం చేయాలి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఎన్ని రోజులకు ఒకసారి తలస్నానం చేస్తే మంచిది అంటే మాత్రం ఒక్కొకరు ఒక్కోలా చెబుతుంటాయి. అయితే తలస్నానం అనేది జుట్టు రకం అనేది బట్టి మారుతుంది. కర్లీ, డ్రై, ఆయిలీ హెయిర్ ఉన్న వారు ఒక్కొకరు ఒక్కో విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. వాటిని సరైన పద్ధతిలో పాటిస్తే జుట్టు రాలడం, పొడి బారడం, చుండ్రు వంటి సమస్యలు సులభంగా తగ్గించుకోవచ్చు.
కర్లీ హెయిర్ ఉంటే ఎన్నిసార్లు తలస్నానం చేయాలి?
కర్లీ హెయిర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. అయితే ఉంగరాల జుట్టు త్వరగా పొడిబారుతుంది. కాబట్టి గాఢత తక్కువగా ఉండే షాంపూలతో వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తలస్నానం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇక జుట్టు తేమ కోల్పోకుండా ఉండాలంటే తలస్నానం చేయడానికి గంట లేదా రెండు గంటల ముందు నూనెతో తలకు మసాజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
సెమీ కర్లీ హెయిర్ ఉంటే..
సెమీ కర్లీ హెయిర్ ఉన్న వ్యక్తులు వారంలో రెండు లేదా మూడుసార్లు తలస్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే తలస్నానానికి నూనె ఆధారిత షాంపూలను ఎంచుకోవద్దని సలహా ఇస్తున్నారు. వీటివల్ల జుట్టుకు ఉన్న సహజమైన కర్లీనెస్ కోల్పోయే అవకాశం ఎక్కువ ఉందని చెబుతున్నారు. ఇక గాఢత తక్కువగా ఉండే షాంపూలను ఎంచుకుంటే జుట్టుకు ఎటువంటి డ్యామేజ్ లేకుండా జాగ్రత్త పడొచ్చని అంటునన్నారు.
పొడి జుట్టు ఉన్నవారు..
పొడి జుట్టు ఉన్న వారికి తల తొందరగా ఎండిపోయినట్లు అవుతుంది. వీరికి జుట్టు గడ్డిలా మారడం, కుదుళ్లలో దురద, అలర్జీల వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అంతేకాదు హెయిడ్ డ్రయ్యర్లు వాడటం వల్ల జుట్టు చివర్లు చిట్లుతుంటాయి.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు నిర్జీవంగా మారిపోతుంది. అందుకే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కోసం పొడి జుట్టు ఉన్న వారు సహజసిద్ధమైన షాంపూలనే ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఎలాంటి హానికారక రసాయనాలు ఉండవు కాబట్టి.. జుట్టు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఇక పొడిజుట్టు ఉన్న వారు వారానికి రెండుసార్లు తలస్నానం చేస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. అదే జుట్టు పొడిగా, ఆకృతిగా, మందంగా ఉంటే, వారానికి కనీసం రెండు నుంచి మూడుసార్లు తలస్నానం చేయవచ్చని చెబుతున్నారు. తలస్నానంతో పాటు ప్రతిరోజూ ఎక్కువగా నీళ్లు తాగడం, నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, కూరగాయల్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఆయిలీ హెయిర్‌కూ..
ఇక ఆయిలీ హెయిర్ ఉన్న వారి కుదుళ్లలో ఉండే నూనె గ్రంథులు ఎక్కువగా నూనెను విడుదల చేస్తుంటాయి. తద్వారా కుదుళ్లు, జుట్టు జిడ్డుగా మారతుంటాయి. తద్వారా చుండ్రు, దురద సమస్యలు వస్తుంటాయి. అందుకే ఆయిలీ హెయిర్ ఉన్న వారు రోజు విడిచి రోజు తలస్నానం చేయాలని సూచిస్తున్నారు. అలాగే నూనె ఆధారిత షాంపూలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సలహా ఇస్తున్నారు. ఇక కండీషనర్లను కూడా జుట్టు చివర్లకు మాత్రమే రాసుకోవాలని చెబుతున్నారు.
Read More :
