విధాత : నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారని, ఇదే రీతిలో ప్రతి జిల్లాలకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నర్మేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ పామ్ స్టార్ట్ చేశారని, ప్రతి జిల్లాలకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించాలని భావిస్తున్నారన్నారని వెల్లడించారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి రూ.300 కోట్లు కేటాయించి తుమ్మల నాగేశ్వరరావు పనులు పూర్తి చేయించారని తెలిపారు. ఈ ఆయిల్ ఫ్యాక్టరీకి రూపం తెచ్చిన తుమ్మలకు జిల్లా రైతాంగం తరుపున ధన్యావాదాలు తెలియజేస్తున్నామన్నారు.
ఈ మధ్య గుజరాత్ వెళ్లినప్పుడు అక్కడ పాల సేకరణ గ్రామీణ స్థాయి నుండి జరుగుతుంది అని..అక్కడి అమూల్ పాలు దేశ వ్యాప్తంగా వ్యాపించాయని పొన్నం గుర్తు చేశారు. అదే రీతిలో
ఈ ప్రాంత రైతులు ఆయిల్ పామ్ పై దృష్టి సారించాలని సూచించారు. ఇతర పంటలకు ఎదురవుతున్న ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాడం లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సహకార నూనె గింజలు, సాగుదారుల సమాఖ్య చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
కాంగ్రెస్ పార్టీకి త్వరలో జీవన్ రెడ్డి రాజీనామా?
Rajasekhar | హీరో రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ ప్రారంభించారా.. కోట్లు సంపాదిస్తున్నారంటూ వార్తలు..
